telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ప్రాణాలు తీసిన యూట్యూబ్ పాప్ కార్న్ రెసిపీ…!?

UTube

జేజే (14), జియాయు (12) అనే ఇద్దరు యువతులు ఎమ్‌ఎస్ యా అనే యూట్యూబ్ చానల్ చూసి పాప్‌కార్న్ చేయదలుచుకున్నారు. అయితే యూట్యూబర్ చేసినట్టుగానే.. వీరిద్దరూ ఆ పాప్‌కార్న్‌ను ఆల్కహాల్ ల్యాంప్ ఉపయోగించి ఓ సోడాలో చేయడానికి ప్రయత్నించారు. సోడా క్యాన్‌లో ఆల్కహాల్‌ను వేడి చేసే సమయంలో అది ఒక్కసారి పేలడంతో ఇద్దరు యువతులు మంటలలో కాలిపోయారు. ఇద్దరినీ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. కొద్ది గంట్లో జేజే చనిపోయింది. జియాయు చర్మం మొత్తం కాలిపోయిందని.. కాస్మటిక్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్లు చెప్పారు. చైనాలో ఈ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన గురించి తెలుసుకున్న యూట్యూబర్ మిస్ యా తాను ఒక క్యాన్‌లో చేస్తే.. యువతులు రెండు క్యాన్లను ఉపయోగించినట్టు తెలిపింది. ఆ కారణంగానే పేలుడు సంభవించిందని చెప్పింది. తప్పు ఎవరిదైనప్పటికీ తాను ఇద్దరు యువతుల కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేస్తానని భరోసా ఇచ్చింది. కాగా, ఆమె యూట్యూబ్ చానల్‌కు 7.5 మిలియన్ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

Related posts