telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

స్టార్ బ్రదర్స్ మల్టీస్టారర్…!

Surya

సూర్య, కార్తీ ఇద్దరూ తమిళ అగ్ర హీరోలు. అయినప్పటికీ వీరికి తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి క్రేజ్ ఉంది. వీరిద్దరో కలిసి ఇంతవరకు ఒక్క సినిమాలోనూ నటించలేదు. తాజాగా వార్తల ప్రకారం వీరిద్దరూ కలిసి నటించబోతున్నారు. మలయాళంలో ఇటీవల కాలంలో మంచి హిట్ అనిపించుకున్న ‘అయ్యప్పనుమ్ కోషియం’ తమిళ రీమేక్ లో ఈ అన్నదమ్ములిద్దరూ కలసి నటించనున్నట్టు తాజా సమాచారం. ఈ చిత్రం తమిళ రీమేక్ హక్కులను ఇటీవలే సూర్య కొనుగోలు చేశాడట. తమ్ముడితో కలిసి ఇందులో నటించాలని ఆయన ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే కనుక వీరి అభిమానులకు ఇక పండగే అని చెప్పచ్చు. ఇదిలావుంచితే, ఈ మలయాళం చిత్రాన్ని తెలుగులో కూడా రీమేక్ చేయడానికి మరోపక్క సన్నాహాలు జరుగుతున్నాయి. నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రం తెలుగు రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారు. బాలకృష్ణ, రానాలతో దీనిని ఆయన రీమేక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

Related posts