telugu navyamedia
సినిమా వార్తలు

యూట్యూబ్ సెలబ్రిటీ గంగవ్వ కొడుకు ఆత్మహత్యాయత్నం

Gangavva

యూట్యూబ్ సెలబ్రిటీ గంగవ్వ కొడుకు రాజా ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపుతోంది. పొలంలో పురుగుల మందు తాగడడంతో అతడిని జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే విషయం తెలుసుకున్న గంగవ్వ హుటాహుటిన జగిత్యాలకు చేరుకుంది. కుటంబ సమస్యల నేపథ్యంలో… ఆత్మహత్యకు యత్నించాడని, ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పినట్టు తెలుస్తోంది. గంగవ్వ “మై విలేజ్” షో ద్వారా ప్రాచుర్యాన్ని సంపాదించింది. టీవీ 1 తో పాటు పలు మీడియా సంస్థలకు సంబంధించిన కార్యక్రమాల్లో నటించింది. తెలంగాణ యాసలో మాట్లాడుతూ పల్లెటూరి అమాయకత్వం ఆమెను జనానికి దగ్గరయ్యేలా చేశాయి. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని లంబాడిపల్లికి గ్రామానికి చెందిన గంగవ్వ ఒకప్పుడు రోజు కూలిగా ఉండేది. ఇటీవలే గంగవ్వ సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టింది. “మల్లేశం”, “ఇస్మార్ట్ శంకర్” సినిమాలో కూడా నటించింది. కాగా ఇప్పుడే తమ బతుకులు బాగుపడుతున్నాయన్న సమయంలో కొడుకు ఆత్మహత్యా ప్రయత్నం చేయడం అనేది గంగవ్వను తీవ్ర మనోవేదనకు గురి చేసింది.

Related posts