telugu navyamedia
ట్రెండింగ్ సాంకేతిక

‘బెడ్‌టైమ్ రిమైండర్’… యూట్యూబ్ లో సరికొత్త ఫీచర్

youtube logo

లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలంతా ఇంటికే పరిమితమైపోయారు. దీంతో స్మార్ట్‌ఫోన్ వినియోగం ఎక్కువగా పెరిగింది. ఓ రకంగా చెప్పాలంటే ఎడిక్ట్ అయిపోయారనే చెప్పాలి. వీడియో స్ట్రీమింగ్‌‌ల రేటు చాలా వరకూ పెరిగిపోయింది. యూట్యూబ్‌లో వెబ్ సిరీస్, సినిమాలు, పలు షోలు చూస్తూ ఎప్పుడు నిద్రిస్తున్నారో, ఎప్పుడు లేస్తున్నారో కూడా తెలీని పరిస్థితి నెలకొన్నది. అందుకే నిద్రకు ఆటంకం కలిగించకుండా సరికొత్త ఫీచర్‌ను ప్రవేశ పెట్టింది యూట్యూబ్. ‘బెడ్‌టైమ్ రిమైండర్’ పేరుతో దీనిని పరిచయం చేసింది. నిద్రించాలనుకున్న సమయాన్ని ముందే యూట్యూబ్‌కి చెబితే చాలు. ఆ సమయంలో అది మీకు రిమైండ్ చేస్తుంది. యూట్యూబ్‌ సెట్టింగ్స్‌లో స్టార్ట్, ఎండ్ టైమ్‌లను సెట్ చేసుకోవాలి. ఎండ్ సమయానికి చూస్తున్న వీడియో కాస్త ఉండిపోతే ‘వెయిట్ అంటిల్ ద వీడియో ఈజ్ ఓవర్’ ఆప్షన్‌ని క్లిక్ చేయొచ్చు. అంతేకాదు రిమైండర్‌ని స్నూజ్ చేయొచ్చు.. అలాగే డిస్‌మిస్‌ చేసుకొనే సౌకర్యాన్నయూట్యూబ్ అందిస్తున్నది.

Related posts