telugu navyamedia
ట్రెండింగ్ సామాజిక

ఆ విషయాలు మాట్లాడుకోడానికే.. యువత సగం సమయం వెచ్చిస్తున్నారట.. !

youth spending half time in a day for sex chat

శృంగారమంటే ఒకప్పుడు ఎంతో రహస్యంగా కేవలం నాలుగు గోడల మధ్య జరిగే కార్యక్రమంగా భావించేవారు. ఆ విషయాలు కూడా ఎవరు నోరారా చెప్పుకోవడం కానీ, చెవులారా వినడం కానీ చేసేవారు కాదు. కానీ దానిని దాచిపెట్టడం వలన ఆయా తారలతో కలిగిన ఉత్సుకత తో అది బట్టబయలు అయిపోయింది. ఇంకా చెప్పాలంటే, అసలు దానిని గురించి మాట్లాడుకోడానికే సగం సమయం నేడు యువత ఖర్చుచేస్తున్నట్టు తాజాగా ఒక సర్వే వెల్లడించింది. వినడానికి విడ్డురంగా ఉన్నా మనదేశంలోనే ఇంత విచ్చలవిడిగా ఇవి జరుగుతుండటం పాశ్చాత్యులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుందట.

నాలుగు గోడల మధ్య నుండి ఇప్పుడు అది బయటకు, అక్కడి నుంచి స్మార్ట్ ఫోన్ లోకి కూడా దూరేసింది. ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ చేతిలో లేని వాళ్లు ఎవరు ఉన్నారు చెప్పండి. సో.. శృంగారాన్ని కూడా స్మార్ట్ ఫోన్ లో కానిచ్చేస్తున్నామంటున్నారు చాలా మంది యువత. ఈ మధ్య అమెరికాకు చెందిన ఓ సంస్థ చేపట్టిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. స్వయంగా యువతీయువకులే ఈ విషయాలను పంచుకున్నారు.

యువత స్వయంగా తమకు సెక్స్ చాట్ చేసే అలవాటు ఉందని అంగీకరించింది. వాట్సాప్ సహా పలు సోషల్ మీడియా అప్లికేషన్ల ద్వారా నిత్యం సెక్స్ గురించి మాట్లాడుకుంటున్నామని వారు చెప్పారు. ఇంకొందరైతే.. నగ్న చిత్రాలను కూడా వాటిలోనే షేర్ చేసుకుంటున్నామని చెప్పారు. నగ్న చిత్రాలను షేర్ చేసుకునే వారి జాబితా 50శాతానికి పైగా ఉండటం గమనార్హం. ఇక తమ శృంగార అనుభవాలను వీడియోలుగా తీసుకునే స్థాయికి కూడా చాలా మందికి వచ్చేశారు. దాదాపు మూడో వంతు యువత వీడియోలు తీసుకున్నామని చెప్పారు. తమ పార్ట్ నర్ కి మధ్య దూరం పెరిగినప్పుడు ఆ వీడియోలు చూసుకొని తృప్తిపడతామని వారు తెలిపారు. కొద్ది రోజుల తర్వాత వాటిని డిలీట్ చేసుకుంటామని తెలిపారు. మొత్తానికి యువత ప్రతి రోజులో సగానికిపైగా సమయాన్ని ఈ విషయాలు పంచుకోడానికే వెచ్చిస్తున్నారట. వయసుతో వచ్చే ఆసక్తి, వయసుతోనే పోతుందేమోలే!

ఇది కొంతవరకు ఆరోగ్యకరమే అయినప్పటికీ, ఇటువంటివి బలహీనతలుగా మారితేనే ప్రమాదం అంటున్నారు నిపుణులు. తమను తాము సముదాయించుకోగలం అంటూ సమాధానం ఇస్తున్నారు యువత. అయితే మంచిదే కదా!

Related posts