క్రీడలు వార్తలు

బ్యాడ్మింటన్‌ ఫైనల్లో లక్ష్యసేన్

Lakshya Sen

భారత యువతార లక్ష్య సేన్‌ యూత్‌ ఒలింపిక్స్‌ పురుషుల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ విభాగంలో ఫైనల్లో పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. గురువారం జరిగిన సెమీఫైనల్లో లక్ష్య సేన్‌ 14–21, 21–15, 24–22తో కొడాయ్‌ నరయోకా (జపాన్‌) పై గెలుపొందాడు. నేడు జరిగే ఫైనల్లో లీ షిఫెంగ్‌ (చైనా)తో లక్ష్య సేన్‌ ఆడతాడు.

హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ (2010లో) తర్వాత యూత్‌ ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌ ఈవెంట్‌లో ఫైనల్‌కు చేరిన రెండో భారతీయ ప్లేయర్‌గా లక్ష్య సేన్‌ గుర్తింపు పొందాడు. మరోవైపు ఫైవ్‌–ఎ–సైడ్‌ హాకీ ఈవెంట్‌లో భారత పురుషుల, మహిళల జట్లు క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకున్నాయి. చివరి రౌండ్‌ లీగ్‌ మ్యాచ్‌ల్లో పురుషుల జట్టు 5–2తో కెనడాను, మహిళల జట్టు 5–2తో దక్షిణాఫ్రికాను ఓడించాయి. మహిళల టీటీ సింగిల్స్‌ కాంస్య పతక పోరులో అర్చన 1–4తో ఆండ్రియా (రొమేనియా) చేతిలో ఓడింది.

Related posts

టాప్ లెస్ గా సాంగ్ పాడి సంచలనం రేపిన టెన్నిస్ సూపర్ స్టార్ విలియమ్స్…!

nagaraj chanti

రవి శాస్త్రి పై మండిపడ్డ.. గంగూలీ, గవాస్కర్…

chandra sekkhar

దాయాదిని మళ్ళీ మట్టి కరిపించిన భారత్…

chandra sekkhar

Leave a Comment