వార్తలు విద్య వార్తలు సామాజిక

26 ఏళ్లకే జిల్లా జడ్జిగా ఎంపికైన మహిళ

Young Woman Select For District judge

కర్ణాటక న్యాయ శాఖలో ఇటీవల 101 జడ్జి ఉద్యోగాల నియమకాలకు పరీక్షలు నిర్వహించారు. 4 వేల మంది అభ్యర్థులు హాజరు కాగా వారిలో 946 మంది ప్రధాన న్యాయమూర్తి పరీక్షకు ఎంపికయ్యారు. ఇంటర్వ్యూలలో 86 మందికిగాను 33 మంది అర్హత సాధించారు. కాగా వారిలో విజయపుర జిల్లాకు చెందిన చైత్రా కులకర్ణి 26 ఏళ్లకే జిల్లా కోర్టు జడ్జి ఉద్యోగానికి ఎంపికైంది.

బాగలకోటెలోని ఎస్‌ఆర్‌ఎన్‌ కామర్స్‌ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న వసంత కులకర్ణి కుమార్తె చైత్రా కులకర్ణి విజయపుర జిల్లా ఇండి తాలూకా నందరిగికి చెందినవారు. ఆమె ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు కన్నడ మీడియంలోనే విద్యనభ్యసించారు. బాగలకోటెలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. సీనియర్‌ న్యాయవాది ఆర్‌ఎస్‌ బరగుండి వద్ద మూడేళ్ల పాటు శిక్షణ పొందారు. హైకోర్టులో ఆరు నెలల పాటు శిక్షణ పొందిన అనంతరం ప్రధాన న్యాయమూర్తి పదవిని చేపట్టనున్నారు.

 

Related posts

కోమటిరెడ్డి, సంపత్ ల కేసులో.. తెలంగాణా సర్కార్ కు ఊరట!

madhu

నీ రూపం…

chandra sekkhar

‘మార్పు లేని పొద్దు’…

chandra sekkhar

Leave a Comment