దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో “ఆర్ఆర్ఆర్” అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. జూలై 30, 2020న విడుదల కానున్న ఈ సినిమా షూటింగ్ 70 శాతం పూర్తైందని ఇటీవల మేకర్స్ తెలిపారు. అయితే చిత్రంలో చరణ్ సరసన కథానాయికగా అలియా భట్, ఎన్టీఆర్‌కి జోడీగా ఓలివియా మోరిస్‌పై సనటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చితాన్ని వచ్చే ఏడాది జూలై 30న విడుదల చేయబోతున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. అయితే భారీ చిత్రం కావడం వల్ల, షూటింగ్ అనుకున్న విధంగా సాగకపోవడం వల్ల ఈ సినిమా విడుదల ఆలస్యమవుతుందని ఇటీవల వార్తలు వచ్చాయి. అనుకున్న విధంగా జూలై 30న కాకుండా, దసరాకు విడుదల ఉండొచ్చని టాక్ వచ్చింది. అయితే అనుకున్న సమయం కంటే ముందే `ఆర్ఆర్ఆర్` షూటింగ్ పూర్తవుతోందని తెలుస్తోంది. జనవరి రెండో వారానికల్లా షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. నాలుగైదు నెలలు ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతాయని, అనుకున్నవిధంగా జూలై 30న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ పరిసర ప్రాంతాలలో జరుగుతుంది. ఎన్టీఆర్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అయితే సినిమాకి సంబంధించి ఎలాంటి ఫోటోలు, వీడియోలు బయటకి రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్న రాజమౌళికి షాక్ ఇచ్చారు నెటిజన్స్. తాజాగా కొమురం భీం పాత్ర పోషిస్తున్న ఎన్టీఆర్ లుక్‌ని రివీల్ చేసి షాక్ ఇచ్చారు నెటిజన్స్. భారీ గెడ్డం, తలకి పాగా, నల్లటి దుస్తులు ధరించిన ఎన్టీఆర్ ఊరిని ఉద్దేశించి ఏదో మాట్లాడుతున్నట్టు అర్ధమవుతుంది.
previous post