telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్

ప్రేమోన్మాది దాష్టికం.. యువతిపై పెట్రోదాడి .. 90 శాతం కాలినా..

young man petro attack on young girl

యువత ఏ దారిన వెళుతుంది. వారికి కళాశాలలో ఏమి బోధిస్తున్నారు. నిన్న ఒక బాలికపై కత్తితో దాడి, నేడు పెట్రోల్ తో దాడి…ఇలా అయితే యువత రేపటి భారతాన్ని ఏవిధంగా రక్షించుకోగలదు.. ఇదా యువ భారతం అంటూ.. పలు విమర్శలతో వారినే నిందించాలా.. సమసమాజ స్థాపన చేయలేకపోతున్నామా.. అని వారి పెద్దల తరాలు ఆలోచించాలా.. ఎక్కడ ఉంది తప్పు.. ఎక్కడ జరుగుతోంది పొరపాటు.. ! యువత ఇదే దారిలో వెళితే, రేపటి భారతదేశం ఎటు వెళ్లనుంది.. !! తాజాగా, హన్మకొండ నయీమ్‌నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. వాగ్దేవీ డిగ్రీ కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థినిపై దుండగుడు పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. విద్యార్థిని కళాశాలకు వెళ్తున్న సమయంలో నడిరోడ్డుపైనే దుండగుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ద్విచక్రవాహనంపై వచ్చి పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు.

తనను రక్షించాలని యువతి ఆర్తనాదాలు చేసింది. అమ్మాయిని రక్షించేందుకు యత్నించిన వారిని దుండగుడు బెదిరించాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. 90 శాతానికిపైగా కాలిన గాయాలతో ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. హన్మకొండ ఏసీపీ చంద్రయ్య, సీఐ సంపత్‌ కుమార్‌ సంఘటనా స్థలానికి చేరుకొని ఘటనపై దర్యాప్తు చేపట్టారు. యువకుడు అదే కళాశాలలో చదువుతున్నట్లుగా అనుమానిస్తున్నారు. అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్‌ చేశారు.

Related posts