telugu navyamedia
క్రైమ్ వార్తలు

హైదరాబాద్ ఫిలింనగర్‌లో యువకుడి దారుణ హత్య

New couples attack SR Nagar

హైదరాబాద్‌  ఫిలింనగర్‌లో దారుణం చోటుచేసకుంది. సోమవారం ప్రేమ్‌ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అయితే స్నేహితులే ప్రేమ్‌ను కొట్టి చంపినట్టుగా తెలుస్తోంది. ప్రేమ్‌కు, సతీశ్‌ అనే వ్యక్తికి మధ్య ఉన్న విభేదాలే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

 గంజాయి తాగుదామని సతీశ్‌ అనే వ్యక్తి ప్రేమ్‌ను పిలిచారు. గంజాయి తాగిన అనంతరం మత్తులో ప్రేమ్‌కు, సతీశ్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో అక్కడే ఉన్న మిగతా వ్యక్తులు ప్రేమ్‌పై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ప్రేమ్‌ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేపట్టారు.

Related posts