telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సీనియర్ నటితో.. యువ నటుడి వివాహం..!

marriage wishes gone viral and case filed

హీరో యువకుడు, సీనియర్ నటితో బంధానికి సిద్ధం అయినట్టుగా టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. అతడు, హీరోగానే కాకుండా తన సినిమాలకు సంబంధించిన కథల్లో కూడా ఇన్వాల్వ్ అవుతుంటాడు ఓ కుర్రోడు. రచయితగా కూడా మంచి గుర్తింపే తెచ్చుకున్నాడు. గతేడాది అతడు నటించిన సినిమా మంచి సక్సెస్ ని సాధించింది. అయితే చాలా కాలంగా ఇతడు సీనియర్ నటితో డేటింగ్ చేస్తున్నాడు. కెరీర్ ఆరభంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తరువాత మరో సినిమా చేయలేదు. సినిమా ఇండస్ట్రీలో వీరిది పెద్ద కుటుంబం.

సొంతంగా స్టూడియో, బ్యానర్ లు కూడా ఉన్నాయి. ఆ స్టూడియో వ్యవహారాలన్నీ ఆమె దగ్గరుండి చూసుకుంటుంది. ఇప్పుడు ఆమె తన లాంగ్ టైం బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోవాలని భావిస్తోంది. ఇదివరకే ఆమెకి వివాహం జరిగినా.. భర్త చనిపోవడంతో ఒంటరిగానే ఉంటోంది. ఇప్పుడు ఆమె కుటుంబసభ్యులు కూడా ఈ పెళ్లి విషయంలో సంతోషంగానే ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాలని చూస్తున్నారు. కానీ హీరో కుటుంబసభ్యులు ఈ పెళ్లికి అభ్యంతరం చెబుతున్నారని సమాచారం. ఆ కారణంగానే అనౌన్స్మెంట్ కూడా ఆలస్యమవుతుందట. అన్ని అనుకూలిస్తే .. వెడ్డింగేనట.

Related posts