telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వెబ్ సిరీస్ కు హన్సిక గ్రీన్ సిగ్నల్

Hansika

ప్రపంచవ్యాప్తంగా కరోనా ఎంటరయ్యాక థియేటర్స్ అన్నీ క్లోజ్ కావడంతో ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌కి డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే హీరోహీరోయిన్లు, దర్శకనిర్మాతలు వెబ్ సిరీస్‌ల దిశగా అడుగులేస్తున్నారు. తాజాగా హాట్ బ్యూటీ హన్సిక కూడా ఓ వెబ్ సిరీస్ చేసేందుకు రెడీ అయిందట. ‘భాగమతి’ ఫేం అశోక్ దర్శకత్వంలో రూపొందే ఓ వెబ్ సీరీస్‌లో హన్సిక నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనుందట. కథ నచ్చడంతో ఈ వెబ్ సిరీస్ చేసేందుకు హన్సిక వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. నేటి యువతకు కావాల్సిన హాట్ నెస్ జోడిస్తూ మహిళా సమస్యలను తనదైన స్టైల్‌లో చూపించనున్నారట అశోక్. అతిత్వరలో ఈ వెబ్ సిరీస్ సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ మధ్యకాలంలో తన హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాని ఉక్కిరిబిక్కిరి చేస్తూ వేడి పుట్టిస్తోంది. మరి ఈ వెబ్ సిరీస్ తో డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో కూడా హన్సిక సత్తా చాటుతుందేమో చూడాలి.

Related posts