telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

అరటిలో ఎన్ని ఔషధ గుణాలో…!

Banana

అరటి పండు ఆరోగ్యానికి మంచిది అనే విషయం అందరికీ తెలిసిందే. పచ్చి అరటికాయలను కూరలుగా వాడుకుని తింటూ ఉంటాము. మరి అరటి చెట్టులోని మిగిలిన భాగాల సంగతేంటి ? అరటిచెట్టు మొత్తం ఔషధ గుణాలే అన్న విషయం చాలామందికి తెలియదు. గతంలో పచ్చి అరటికాయతో పాటు, అరటి పువ్వు, అరటి మొవ్వ, అరటి దుంప, అరటి ఊచ వీటిని కూడా వివిధ రకాలుగా ఆహారంగా తీసుకుని ఆరోగ్యంగా ఉండేవారు. అయితే ఈ ఆధునిక యుగంలో మాత్రం పిజ్జాలు, బర్గర్లు అంటూ అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు అరటిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

Banana
అరటి చెట్లలో చాలా రకాల జాతులున్నాయి. అయితే మనం నిత్యం తినే అరటి చెట్ల విషయానికొస్తే… అరటి చెట్టు రసం చలువ చేస్తుంది. వాతాన్ని పెంచి వీర్యపుష్టి చేస్తుంది. మూత్రపిండాలలోని రాళ్లను, ఉదరంలో రోగాలను పోగొడుతుంది. అరటి పువ్వు వడియాలు దగ్గు, ఆయాసం వంటి శ్వాససంబంధిత రోగాలను నయం చేస్తాయి. అరటి ఆకులో భోజనం చేస్తే జ్వరం, క్షయ, దగ్గు, ఉబ్బసం వంటి వ్యాధులను హరించి వేస్తుంది. స్త్రీలలో అతిరుతురక్తస్రావం ఆగాలంటే… బాగా మగ్గిన ఒక అరటి పండు, 50 గ్రాముల నెయ్యి కలిపి రోజుకు మూడు పూటలా తినాలి. చిన్న అరటిపండును తింటే మూత్రంలో మంట తగ్గుతుంది. బాగా పండిన అరటిపండును కాలిన లేపనంలా రాస్తే మంట తగ్గి గాయాలు త్వరగా మానుతాయి. తెల్లబోల్లి మచ్చలు తగ్గాలంటే అరటి చెట్టు దూట రసం తీసి, తగినంత పసుపు కలిపి లేపనంలా రాయాలి. అరటి దుంప రసం 20 గ్రాములు, పటిక బెల్లం 20 గ్రాములు కలిపి రెండు పూటలా సేవిస్తూ ఉంటే శెగరోగాలు నయమవుతాయి. అరకప్పు అరటి ఊచ రసం పరగడుపునే తీసుకుంటే ఆగిన బహిష్టు మళ్ళీ వస్తుంది. ఇలా అరటి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.

Related posts