telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

అవిసె గింజలు ఆరోగ్యానికి మేలు

Linseed

అవిసె గింజలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అవిసె గింజలు మాత్రమే కాదు అవిసె చెట్టు ఆకులు, పువ్వులు, చెక్కలు, వేర్లు ఆయుర్వేద గుణాలతో కూడుకున్నవి. ఒమేగా 3 ఫ్యాటీయాసిడ్స్, ఫైబర్, యాంటీ ఇంఫ్లామేటరీ గుణాలను మెండుగా కలిగి ఉన్నవే ఈ అవిసె గింజలు. ఇవి అందించే ఆరోగ్య ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు. స్వయంగా అగస్త్య మహర్షుల వారు ఈ మహా ఔషధిలోని ఆరోగ్య ప్రయోజనాల గురించి మనకు తెలియజెప్పారని ఆయుర్వేద నిపుణులు అంటారు.

* అవిసెలలో తెల్లపూలు, నల్లపూలు, పసుపు పూలు, ఎర్ర పూలు… ఇలా నాలుగు రకాలు ఉంటాయి. వీటి చెట్టు బెరడు, ఆకు, పువ్వు చేదుగా ఉంటాయి. వీటి రసం వేడి చేస్తుంది. దీనివలన కఫ రోగాలు, క్రిమి రోగాలు, పైత్య జ్వరాలు, సర్ప విషం హరించిపోతాయి. అతికొవ్వును కూడా తగ్గిస్తుంది.
* అవిసె ఆకు రసం గవద బిళ్ళలపై పూస్తూ ఉంటే అవి క్రమంగా తగ్గిపోతాయి.
* అవిసె ఆకుతో కూర వండుకుని తింటే సుఖ విరేచనాలతో పాటు పొట్ట తదితర ప్రాంతాల్లో పెరిగిన అతికొవ్వు కూడా కరిగిపోతుంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ఆచారంలో ఉంది. అయితే ఈ ఆధునిక కాలంలో అవిసె ఆకు దొరకడం కష్టం అనే చెప్పొచ్చు. ముఖ్యంగా పట్టణాలలో ఈ ఆకు ఎలా ఉంటుందో కూడా చాలా మందికి తెలియదు.
* అవిసె ఆకును కడిగి, నలిపి తీసిన రసాన్ని వడపోసి ఒక చుక్క కంటిలో పోసుకుంటూ ఉంటే రేచీకటితో పాటుగా కంటి మసక కూడా తగ్గిపోతుంది.
* అవిసె గింజలను దోరగా వేయించి, అందులో సగం కండచక్కెర కలిపి మెత్తగా దంచాలి. ఆ ముద్దను 10 గ్రామూల లడ్డూలాగా చేసి నిలువ ఉంచుకోవాలి. మూత్రవ్యాధులతో బాధ పడేవారు, మూత్రపిండాలు పాడైపోయినవారు ఉదయం, సాయంత్రం ఆహరం తీసుకోవడానికి గంటముందు ఒక అవిసె లడ్డును తింటే ఆ వ్యాధులన్నీ త్వరగా తగ్గిపోతాయి.
* దోరగా వేయించిన 40 గ్రాముల అవిసెగింజలు, 10 గ్రాముల మిరియాలు విడివిడిగా దంచి, జల్లించి కలుపుకోవాలి. రోజూ 3 గ్రాముల పొడిని ఒక చెంచా తేనెతో కలిపి తింటూ ఉంటే నాలుగు వారాల్లో ఉబ్బసం సమస్య తగ్గిపోతుంది.
*అవిసె గింజలు, పసుపు కొమ్ములు సమంగా తీసుకుని మెత్తగా నూరి సెగ గడ్డలపైన వేసి కట్టు కడుతూ ఉంటే మూడురోజులలో గడ్డలు పగిలి, పుండు మాడిపోతుంది.
*సీమ అవిసె గింజలు, మినపపప్పు, గోధుమలు, దోరగా వేయించిన పిప్పళ్ళపొడి సమ భాగాలుగా కలిపి నిలువ ఉంచుకోవాలి. రోజూ స్నానానికి గంట ముందు తగినంత పొడిని తీసుకుని, మంచి నెయ్యితో కలిపి శరీరమంతా రాసుకోవాలి. అది బాగా ఆరిపోయిన తరువాత స్నానం చేస్తే మంచి శరీరకాంతి వస్తుంది.

Related posts