telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఉద్యోగులను … పింక్ స్లిప్ లతో కొడుతున్న .. యోగి

Mamatha Break Yogi Rali West Bengal

సంచలనాల యోగి ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయం మంత్రులు, ఉద్యోగులకు ఆందోళన కలిగిస్తుంది. పనితీరు బాగాలేని వారిపై ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతున్నట్టు వార్తలు రావడంతో అందరిలోనూ టెన్షన్ మొదలైంది. పనితీరు బాగాలేని వారిని గుర్తించిన ప్రభుత్వం 29 విభాగాల్లో 201 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు ఇచ్చినట్టు ఓ పత్రిక ప్రటించింది. ఈ జాబితాలో మరో 417 మంది ఉద్యోగులు ఉన్నారని, వారిని సస్పెండ్ చేయడం కానీ, తొలగించడం కానీ చేసే అవకాశం ఉందని పేర్కొంది.

ఈ జాబితాలో విద్యుత్ అధికారులే ఎక్కువ ఉండడం గమనార్హం. పనితీరు, అవినీతి ఆరోపణల కారణంగా వీరు ఈ జాబితాలో చేరినట్టు తెలుస్తోంది. యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. పనితీరు బాగుంటే రివార్డులు ఇచ్చి సత్కరిస్తామని, లేకుంటే ఇంటికి పంపిస్తామని హెచ్చరించారు. పనితీరు సరిగా లేని ఉద్యోగులపై కేసులు పెట్టడతామని, అధికార దుర్వినియోగానికి పాల్పడితే జైలుకు పంపుతామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

Related posts