telugu navyamedia
సినిమా వార్తలు

ఆకట్టుకుంటున్న “హిప్పీ” లిరికల్ సాంగ్

Hippi

“ఆర్ఎక్స్ 100” సినిమాతో హీరోగా కార్తికేయ యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. కార్తికేయ తాజాగా నటిస్తున్న చిత్రం ‘హిప్పీ’ నిర్మితమైంది. తెలుగుతో పాటు తమిళంలోను రూపొందిన ఈ సినిమాకి కలైపులి థాను నిర్మాతగా వ్యవహరిస్తున్నారు, ‘టీఎన్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు . ఈ చిత్రంలో దిగాంగన కథానాయికగానటిస్తుంది. ఈ చిత్రం నుంచి తాజాగా ఒక లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. “ఎవతివే .. ఎవతివే .. ఎదను పట్టి వదలవే. ఎవతివే .. ఎవతివే .. కళ్లలోంచి కదలవే .. ” అంటూ ఈ పాట సాగుతోంది. అనంత్ శ్రీరామ్ సాహిత్యం .. నివాస్ కె. ప్రసన్న సంగీతం .. కార్తీక్ ఆలాపన యూత్ ను ఆకట్టుకునేలా వున్నాయి. జేడీ చక్రవర్తి .. వెన్నెల కిషోర్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను, త్వరలోనే విడుదల కానుంది. మీరుకూడా ఈ లిరికాల్ వీడియో సాంగ్ ను వీక్షించండి.

Related posts