telugu navyamedia
సినిమా వార్తలు

ఎవరవి నీవు…

na madilo poetry corner

నా ఆంతరంగం యొక్క  
వ్యావహారిక భావజాలాన్ని 
మెరుగుపరచి 
నా వ్యక్తిగత వ్యవస్థ ను మార్చి 
ప్రేమోత్సాహ భరిత ఆకాంక్ష ను 
రగిల్చిన  “ఎవరివి నీవు “

ప్రేమ భావాల గీతికలను 
రాగయుక్తంగా ఆలపిస్తూ 
ఆకర్షిత ఆమోద యోగ్యమైన 
పరిపక్వతలో  ప్రేమోదయ 
భావ వ్యక్తీకరణను ఏర్పరచి
సముచిత యోచనలు
కలిగిస్తున్న “ఎవరివి నీవు “

నా మదిని మలచి 
కోర్కెల ఝరిని అందు రంగరించి 
మోడుబారిన జీవిత వ్యధలకు 
అవకాశాల దుప్పటి కప్పి 
అంగలార్పులు అవమానాలు లేని 
ఆనంద కర జీవితాన్ని
ఆవిష్కరించిన  “ఎవరివి నీవు “

-పాపారావు, ముత్తనపల్లి 

Related posts