telugu navyamedia
సినిమా వార్తలు

“మజిలీ” వీడియో సాంగ్ : ఏడెత్తు మల్లెలే….

Majili

శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత, నాగచైతన్య జంటగా నటించిన “మజిలీ” చిత్రం ఇటీవలే విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికే 50 కోట్ల క్లబ్ లో చేరిన ఈ చిత్రం థియేటర్లలో ఇప్పటికి తన దూకుడును కొనసాగిస్తోంది. సాధారణంగా ఏ భాషలోనైనా ఓ సినిమా హిట్ అయితే ఆ సినిమాను ఇతర భాషల్లో కూడా రీమేక్ చేయడానికి ప్రయత్నాలు మొదలవుతాయి. ఈ చిత్రాన్ని కూడా రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. త్వ‌ర‌లోనే త‌న సొంత బ్యానర్ వండ‌ర్ బార్ ఫిలింస్ సంస్థ‌పై ధ‌నుష్ ఈ చిత్రాన్ని రీమేక్ చేయ‌నున్నాడ‌ని అంటున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి “ఏడెత్తు మల్లెలే…” అనే వీడియో సాంగ్ ను విడుదల చేశారు చిత్రబృందం. ఈ పాటను కాల భైరవ, నిఖిత గాంధీ అద్భుతంగా పాడారు. శివ నిర్వాణ ఈ పాటకు లిరిక్స్ అందించారు. గోపీ సుందర్ ఈ పాటకు సంగీతం అందించారు. ఈ పాట సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ పాటను మీరు కూడా వీక్షించండి.

Related posts