telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

టీఆర్‌ఎస్‌ పార్టీకి షాక్‌… సాగర్‌ బరిలో వైసీపీ అభ్యర్థి !

ycp ap

తెలంగాణలో ఇటీవలే ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే.. ఆ ఎన్నికల్లో అధికార పార్టీ భారీ విజయాన్ని సాధించింది. తాజాగా నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు షెడ్యూల్‌ రావడంతోనే.. అన్ని పార్టీలు ఈ ఉప ఎన్నకపై ఫోకస్‌ పెట్టాయి. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జానారెడ్డి పేరు ఖరారు కాగా..హాలియలో ఈనెల 27న భారీ బహిరంగ సభ నిర్వహించి.. 30న నామినేషన్ దాఖలు చేయనున్నారాయన. అయితే జానారెడ్డికి దీటుగా బలమైన అభ్యర్థులును బరిలోకి దింపాలని టిఆర్ఎస్, బీజేపీ కసరత్తులు చేస్తున్నాయి. నామినేషన్ గడువు నాటికి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.ఇది ఇలా ఉండగా.. అనూహ్యంగా వైసీపీ నుంచి ఓ అభ్యర్థి నామినేషన్‌ వేయడం అందరిని షాక్‌ కు గురిచేస్తోంది. ఇప్పటి వరకు సాగర్‌ ఉప ఎన్నికకు 13 నామినేషన్స్‌ దాఖలయ్యాయని రిటర్నింగ్‌ అధికారి రోహిత్‌ సింగ్‌ తెలిపారు. అందులో 12 ఇండిపెండెంట్లు కాగా.. మరొకరు వైసీపీ అభ్యర్థి అని వెల్లడించారు. తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా.. వెనుక నుంచి టీఆర్‌ఎస్‌కు సపోర్టు చేసే.. వైసీపీ.. సాగర్‌ ఎన్నికల్లో మాత్రం పోటీ చేస్తోంది. దీంతో తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. అయితే.. వైసీపీ బరిలో ఉంటే.. ఓట్లు చీలిపోయి.. టీఆర్‌ఎస్‌కే మేలు జరుగుతుందని రాజకీయా విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి సాగర్‌ ఉప ఎన్నికలు చాలా రసవత్తరంగా సాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Related posts