telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

సీఈసీ సునీల్ అరోరాతో .. జగన్ భేటీ..

YS Jagan Files Nomination Pulivendul

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనధికారికంగా ఓట్లు తొలగించి వారికి అనుకూలమైన ఓట్లను రెండింతలుగా చేసుకుంటున్నారని ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి నేడు ఢిల్లీలో సీఈసీ కి పిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన సునీల్ అరోరాతో భేటీ అయ్యారు. అధికారపక్షం రకరకాల సర్వే ల పేరుచెప్పి, ఓట్లను అక్రమంగా చేర్చడం, వైసీపీ అనుకూలంగా ఉన్న వారిని జాబితాలో నుండి తొలగించడం లాంటివి చేస్తుందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఓటర్ జాబితాలో అవకతవకలు భారీగా చోటుచేసుకుంటున్నట్టు తెలిపారు. అందుకే సీఈసీ కి పిర్యాదు చేసినట్టు చెప్పారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులను కూడా సీఎం తనకు అనుకూలమైన వారినే నియమించుకుంటూ,వారికే ఉన్నత పదవులు లాంటివి ఇస్తున్నారని ఆయన అన్నారు. ఇక డబ్బు పంపిణీలో కూడా పోలీసులను అధికార పక్షం చక్కగా వాడుకుంటుంది ఫిర్యాదులో ప్ పేర్కొన్నట్టు ఆయన తెలిపారు.

Related posts