telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

వైసీపీ మేనిఫెస్టో ..

YCP released MLA Candidates List

మేనిఫెస్టో విడుదల చేసిన వారు అది ఐదేళ్లు వారి వెబ్ సైట్ లో ఉంచాలి.. కానీ తమ పై తమకు నమ్మకం లేక, మేనిఫెస్టో లో నిజాయితీ లేక దానిని వాళ్ళ సైట్ నుండే తొలగించారు. అదొక్కటి చాలు ఆ ప్రభుత్వం ఎన్ని హామీలు నెరవేర్చిందో.. అది కాదు మేనిఫెస్టో అంటే. కులానికి ఒక పేజీ చొప్పున .. కొంతమందికి మాత్రమే పథకాలు దక్కేట్టుగా మేనిఫెస్టో ఎక్కడ ఉండదు, ఉంటె దానిని మేనిఫెస్టో అంటారో అనరో మీరే ఆలోచించుకోవాలి.

ఇవాళ రాష్ట్రంలో కొత్త అధ్యయనం చేసి ఈ విషయాలు అన్ని మాట్లాడుతున్నాం.. ఇన్నేళ్ళుగా పథకాలు గుర్తుకు రాలేదు కానీ, ఎన్నికలు దగ్గరపడగానే అన్ని పథకాలు గుర్తుకు వచ్చాయి.. అవన్నీ ఇప్పుడు ప్రజలకు ఇస్తున్నట్టు ఒక సీన్ చూపిస్తారు కానీ అవన్నీ .. వడ్డీలకే సరిపోవటంలేదు. మరి ఇవన్నీ తెలియకుండా ఏదో ఇస్తున్నారు కదా అని ఓటేస్తే మరో ఐదేళ్లు నరకం అనుభవించాల్సి వస్తుందా.. లేదా! ఈ మోసాలు ప్రజలు అందరూ గ్రహించాలి. రైతులు కూడా ఇలాగె మోసపోయారు, అసలు 87వేలకోట్లు రైతుల రుణాలు, అవి ప్రభుత్వం ఏర్పాటు అయ్యేసరికి 150వేలకోట్లు అయ్యాయి. ఇక రైతు రుణమాఫీకి 24వేలకోట్లు ఇచ్చానని, అదికూడా నాలుగైదు విడతలుగా ఇస్తూనే ఉన్నారు. ఇవన్నీ కూడా వడ్డీలకే సరిపోతాయోలేవో మీరే లెక్కలు చూసుకొంటే స్పష్టంగా తెలుస్తుంది. మరి ప్రభుత్వ మేనిఫెస్టో అమలైందా లేదా అనేది మీకు తెలిసిపోయిందనుకుంటా..!

ఇక నిరుద్యోగ భృతి విషయం కూడా అంతే. ఎన్నికల ముందు మూడు నెలలు ఇచ్చాడు.. అదీ చెప్పింది 2వేలు, ఇచ్చింది వెయ్యి. ఇన్ని చేసి, తాము రాష్ట్రాన్ని దేశంలోకెల్లా ముందు ఉంచామని ప్రభుత్వం చెప్పుకోవటం విచారకరం అని విమర్శించారు జగన్.

వైసీపీ మేనిఫెస్టో సులభంగా, అందరికి ఆమోదయోగ్యంగా ఉందని జగన్ స్పష్టం చేశారు. అందులో ప్రధానాంశాలు ముందుగా చెప్పిన నవరత్నాలతో పాటుగా పాదయాత్రలో ఇచ్చిన హామీలు, బీసీ తదితర అంశాలతో మరింత స్పష్టంగా విడుదల చేస్తున్నాం. దీనిని పూర్తిగా వెబ్ సైట్ లో ఉంచుతున్నాం. ఇది అమలు చేసి, మళ్ళీ ఎన్నికలలో ఓట్లు అడుగుతాం అన్నారు జగన్.

##రైతులకు##
* రైతుకు పెట్టుబడి కింద రూ.50 వేలు
* పంటవేసే సమయానికి పెట్టుబడి కోసం మే నెలలలో రూ.12,500
* పంట బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైతన్నలకు వడ్డీ లేని పంటరుణాలు, ఉచిత విద్యుత్‌, బోర్లు వేయిస్తాం.
* ఆక్వా రైతులకు కరెంటు ఛార్జీలు రూ.1.5లకే ఇస్తాం. వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల కరెంటు
* రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు
* పంటవేసే ముందే ధరలు ప్రకటిస్తాం. గిట్టుబాటు ధరలకు భరోసా
* రూ.4 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి.
* ప్రతి నియోజకవర్గంలో గోదాంలు, శీతలీకరణ గిడ్డంగులు, ఆహార శుద్ధి కేంద్రాల ఏర్పాటు
* మొదటి ఏడాది సహకార సంఘాన్ని పునరుద్ధరిస్తాం. రెండో ఏడాది నుంచి సహకార డెయిరీకి పాలుపోసే రైతుకు లీటరుకు రూ.4 బోనస్‌
* వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్‌ ట్యాక్స్‌ రద్దు. టోల్‌ ట్యాక్స్‌ రద్దు
* ఆత్మహత్య చేసుకున్న రైతులకు వైఎస్‌ఆర్‌ బీమా ద్వారా రూ.7 లక్షలు. ఆ డబ్బు అప్పుల వాళ్లకు చెందకుండా చట్టం
* భూ యజమానులకు ఇబ్బంది లేకుండా కౌలు రైతులకు పంటపై హక్కు ఉండేలా రైతుల భూములకు రక్షణ కల్పించేలా చట్ట సవరణ
* కౌలు రైతులకు వడ్డీ లేని రుణాలు. అన్ని ప్రయోజనాలు వారికి అందే వెసులుబాటు. నవరత్నాల్లోని అన్ని ప్రయోజనాలు వర్తింపు.
* వైద్యం వెయ్యి ఖర్చు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపచేస్తాం.. అన్ని రకాల వ్యాధులను ఈ పథకం పరిధిలోకి తీసుకొస్తాం. కిడ్నీ బాధితులకు నెలకు 10వేలు; ప్రభుత్వ ఆసుపత్రుల దశాదిశ మారుస్తాం.
* అన్ని వర్గాలకూ వైద్యం ఖర్చు రూ. 1000 దాటితే పథకం అమలు.
* ఎన్ని లక్షలు ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుంది.
* ఏ ప్రాంతంలో చికిత్స చేయించుకున్నా ఉచితమే, చికిత్స తరువాత కోలుకునేంత వరకూ కుటుంబానికి సాయం.
* పిల్లల చదువులన్నీ ఉచితం.
* బిడ్డను బడికి పంపే తల్లికి సంవత్సరానికి రూ. 15 వేలు.
* పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ తో పాటు వసతి కోసం విద్యార్థికి ఏటా రూ. 20 వేలు.
* పెన్షన్ల అర్హత వయసు 65 నుంచి 60కి తగ్గింపు.
* వికలాంగులకు, వృద్ధులకు రూ. 3 వేల పెన్షన్.
* ఐదేళ్లలో 25 లక్షల పక్కా ఇళ్లు.
* స్థలం లేని వారికి ఉచిత స్థలం. మహిళల పేరిట రిజిస్ట్రేషన్.
* ప్రత్యేక హోదా వచ్చేంత వరకూ అలుపెరగని పోరు.
* ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం ఏర్పాటు.
* 50 ఇళ్లకు ఒకరి చొప్పున నెలకు రూ. 5 వేల గౌరవ వేతనంతో వాలంటీర్ల నియామకం.
* అన్ని ప్రభుత్వ పథకాలనూ ఇంటి వద్దకే చేరుస్తాం.
* ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ల ఏర్పాటు
* గవర్నమెంట్ కాంట్రాక్టులు నిరుద్యోగ యువతకు ఇచ్చేలా చట్ట సవరణ.
* సబ్సిడీపై యువతకు కావాల్సిన మౌలిక వసతులు.
* వైఎస్ఆర్ ఆసరా ద్వారా మహిళల రుణాలు దశలవారీగా మాఫీ
* మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు.
* మూడు దశల్లో మద్యపాన నిషేధం.
* మద్యాన్ని ఫైవ్ స్టార్ హోటల్స్ కు మాత్రమే పరిమితం చేస్తాం.
* అగ్రీ గోల్డ్ బాధితులకు రూ. 1100 కోట్ల కేటాయింపు.
* తిరుమల శ్రీవారి ఆలయం తలుపులను సన్నిధి గొల్లలు తెరిచే సంప్రదాయ పునరుద్ధరణ.
* సొంత ఆటో, టాక్సీ నడిపేవారికి సంవత్సరానికి రూ. 10 వేలు.
* 18 నుంచి 60 ఏళ్ల వయసువారికి రూ. లక్ష బీమా
* సహజమరణమైనా కుటుంబానికి ఆ డబ్బు చెల్లిస్తాం.
* ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు పారదర్శకంగా ఉండేలా చూస్తాం.
* ఎస్సీ, ఎస్టీ కాలనీలు, గిరిజన తాండాల్లో ఏడాదికి 2 వేల యూనిట్ల ఉచిత కరెంట్ లేదా రూ. 6 వేలు.
* ప్రతి ఐటీడీఏ పరిధిలో ఓ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
* గిరిజనులకు వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన అన్ని హామీల అమలు.
* మాతృభాష పరిరక్షణకై విద్యార్థులకు తెలుగు తప్పనిసరి.
* జర్నలిస్టులకు వారి ప్రాంతాల్లోనే ఇంటి స్థలాలు.
* అర్చకుల పదవీ విరమణ నిబంధన రద్దు.
* అర్చకులకు ఇళ్ల స్థలాల కేటాయింపు.
* దేవాలయాల్లో ధూప, దీప నైవేద్యాల కోసం నిధులు.
* దేవాలయాలకు పంచాయతీ జనాభా ప్రకారం రూ. 10 వేల నుంచి రూ. 35 వేలు.
* మైనారిటీల ఆస్తులను సర్వే చేయించి డిజిటలైజేషన్.
* ప్రభుత్వ ఉద్యోగుల ఇబ్బందులు తొలగించేందుకు కృషి.
* సీపీఎస్ ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ.
* ఉద్యోగులు కోరుకున్న విధంగా 26 శాతం ఐఆర్, సకాలంలో పీఆర్సీ అమలు.
* అన్ని ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్.
* సీనియారిటీ, అర్హతలను బట్టి రెగ్యులరైజేషన్.
* పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు.
* ఉద్యోగులు నిర్భయంగా పనిచేసుకునే స్నేహపూర్వక వాతావరణం.
* అంగన్ వాడీ, ఆశా వర్కర్లకు తెలంగాణ ఇస్తున్న వేతనం కన్నా రూ. 1000 అదనంగా జీతం.
* ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల స్థలం లేకుంటే, వారి ప్రాంతంలో ఇళ్ల స్థలం.
* పరిశ్రమల కోసం మరిన్ని ప్రోత్సాహకాలు.
* నిరుద్యోగ యువకులకు సబ్సిడీ ఇచ్చి పరిశ్రమలు పెట్టిస్తాం.

Related posts