telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

నెల్లూరు జిల్లాలో దూసుకుపోతున్న వైసీపీ

ycp party

నెల్లూరు జిల్లాలో వైసీపీ  దూసుకుపోతుంది. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. సూళ్లూరుపేటలో వైసీపీ అభ్యర్థి సంజీవయ్య 1476 ఆధిక్యంలో ఉన్నారు. అలాగే వెంకటగిరిలో 2478 ఓట్ల మెజారిటీలో వైసీపీ అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి, సర్వేపల్లిలో 1750 ఓట్ల ముందంజలో వైసీపీ అభ్యర్థి కాకాణి కొనసాగుతున్నారు. 

గూడూరులో 1700 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి వరప్రసాద్, నెల్లూరు సిటీలో 2473 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్ధి అనిల్, నెల్లూరు రూరల్‌లో 3000 ఓట్ల మెజార్టీలో వైసీపీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆత్మకూరులో 3240 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ గౌతంరెడ్డి, కావలిలో 303 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కోవూరులో వైసీపీ అభ్యర్థి 1800 ఓట్ల ఆధిక్యం, ఉదయగిరిలో 2700 ఓట్లతో వైసీపీ అభ్యర్థి చంద్రశేఖర్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.

Related posts