telugu navyamedia
andhra news political Telangana

ఏపీ నుండి తెలంగాణకు.. బస్సుల్లో 10 కోట్లు…రాహుల్ కి చంద్రబాబు 5 వేలకోట్లు… 

YCP Vijayasai Reddy Fire Chandrababu
తెలంగాణాలో ఎన్నికల సందర్భంగా విమర్శలు మిన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేత టీడీపీ పై తీవ్రంగా విమర్శలు చేశారు.  ఆంధ్రా నుండి తెలంగాణ టీడీపీ కి బస్సుల్లో కోట్లు (10) తరలిస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు తెలిపారు. ఇందుకోసం యరపతినేని శ్రీనివాస్, రాజేష్, గోపి, సుబ్బారావు అనేవారిని ఎంచుకున్నట్టు ఆయన తెలిపారు. దీనికి తగిన ఆధారాలు త్వరలో బయటపెడతానని ఆయన అన్నారు. ఇదేమి కొత్త పద్దతి కాదని, ఇటీవల కర్ణాటకలో ఇదేమాదిరి నగదు సరఫరా జరిగిందని ఆయన తెలిపారు. 
ఇక రాబోయే ఎన్నికలలో చంద్రబాబు తన వాటాగా రాహుల్ గాంధీకి 5వేల కోట్లు జాతీయ వాటా కింద ముట్టజెపుతున్నట్టు కూడా ఆయన తెలిపారు. అవినీతిలో చంద్రబాబు హిమాలయాల అంచులకు వెళ్లారు అని ఎద్దేవా చేశారు.  ఈ విషయంపై చంద్రబాబు, ఆయన అనుచరులు క్రిమినల్ కేసులు పెట్టవచ్చుగాక.. తాను వాటికి భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు.  

Related posts

లగడపాటిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన లాయర్

vimala p

బీజేపీ ఎదగడాన్ని టీఆర్ఎస్ ఓర్వలేకపోతుంది: లక్ష్మణ్

vimala p

4కె ఆండ్రాయిడ్ టీవీనిని విడుదల చేసిన టీసీఎల్

vimala p