telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

కోడికత్తి .. ఇకమీదట రహస్యంగా.. కోర్టు.. !

YS Jagan Case transfer to NIA

విశాఖపట్టణం విమానాశ్రయంలో వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన కోడికత్తి దాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐయే) కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఈ కేసును రహస్యంగా విచారించాలని విజయవాడలోని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో నిందితులు, న్యాయవాదుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అంతేకాదు, కోర్టులో జరిగే విచారణకు సంబంధించిన వివరాలను ఎలక్ట్రానిక్, ప్రింట్ మాధ్యమాల్లో ప్రచురణ చేయడానికి వీల్లేదని పేర్కొంది.

జగన్‌పై గతేడాది అక్టోబర్‌ 25న విశాఖ ఎయిర్‌పోర్టులో దాడి జరిగింది. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సరిగా దర్యాప్తు చేయలేదని, ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించాలని వైసీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దాడి జరిగిన ప్రదేశం (విమానాశ్రయం లాంజ్‌) కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తుంది కాబట్టి జాతీయ సంస్థలకు ఇవ్వొచ్చని భావించిన ధర్మాసనం కేసును ఎన్‌ఐఏకు అప్పగించింది.

Related posts