telugu navyamedia
health news trending

ఆవలింతల వల్ల నష్టాలున్నాయా!

భూమి పైన ఉన్న ప్రతి మానవునికి అవలింతలు వస్తూనే ఉంటాయి. బాగా తిన్న తర్వాత, లేకపోతే.. ఏదైన బుక్‌ చదువుతుంటే అవలింతలు వస్తాయి. ఈ అంతుచిక్కని ఆవలింతపై ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే వైద్యులు చెబుతున్న దాని ప్ర‌కారం శ‌రీరం అల‌స‌టకు లోనైన‌ప్పుడు ఈ ఆవ‌లింత‌లు వ‌స్తాయి. ఆవలింత‌లు అంటు వ్యాధి ర‌కానికి చెందిన‌వి కాక‌పోయిన‌.. ప్ర‌తిస్పంద‌న‌ల ర‌కానికి చెందిన ఆరోగ్య‌క‌ర‌మైన చ‌ర్య అని చెప్తారు. అంటే ఆవలించే ఇతర వ్యక్తులను చూసినప్పుడు మనలో కూడా ఆటోమేటిక్ గా ఆవలింతలొస్తాయన్నమాట. అస‌లు ఆవ‌లింత‌లు ఎప్పుడెప్పుడు వ‌స్తాయంటే..
శ‌రీరం పూర్తిగా అల‌సిపోయి నిద్ర‌కు వేళాయే అని పిలిచిన‌ప్పుడు ఆవలింతలు వాటంతట అవే వస్తాయి. మనుషులకే కాదు జంతువులకు కూడా ఆవ‌లింతలు వస్తాయి.

#త‌ల్లి క‌డుపులో ఆవ‌లింతః
ఆవ‌లింత త‌ల్లి గ‌ర్భంలో ఉండ‌గానే మొద‌ల‌వుతుందంట‌. 11 వారాల వయసున్న గర్భస్థ శిశువు కూడా ఆవలిస్తుందని అధ్యయనాలు చెప్తున్నాయి. దీన్ని బ‌ట్టి చూస్తుంటే భూమి మీద‌కు రాక ముందే ఆవ‌లింత మ‌న‌కి ద‌గ్గ‌ర‌వుతుంద‌న్న మాట‌. అంటే ఆవ‌లింతే మ‌న ఫ‌స్ట్ ఫ్రెండ్.

#ఆవ‌లింత‌కు నిద్రలేపే_గుణంః
నిద్ర ముంచుకు వ‌స్తుంద‌ని తెల‌ప‌డ‌మే కాదు.. నిద్ర‌లో ఉన్న శ‌రీరాన్ని రీప్రెష్ చేసేందుకు కూడా ఆవ‌లింత వ‌స్తుందట‌. ఈ ఆవ‌లింత‌తో శ‌రీరానికి ఉండే లేజీ నెస్ వెళ్లిపోతుంది.

#ఆవ‌లింత‌కుకొస‌రుకార‌ణంః
మనకి బోర్ కొట్టినప్పుడు లేదా నిద్ర ముంచుకు వ‌చ్చిన‌ప్పుడు ఆవలింత వ‌స్తుంది. బుక్స్ చదివేటప్పుడు చాలా మంది ఆవలించడాన్ని గమనించే ఉంటారు. అయితే ఆవలించడం వల్ల మెదడుకి రక్త ప్రసరణ బాగా జరిగి మెద‌డు మరింత షార్ప్ గా పనిచేస్తుంది. మ‌నకు ఎక్కువ ఆవలింతలు వస్తున్నాయంటే దానర్ధం, మెద‌డు త‌న‌ని తాను యాక్టివ్ గా ఉంచుకోవ‌డానికి ప్రయత్నిస్తుందని అర్థం.

#మ‌రీ ఆవ‌లింత ఎంతసేపు ఉంటుందిః
మ‌నకొచ్చే ఒక్కో ఆవ‌లింత‌ సగటున 6 సెకన్ల వరకూ ఉంటుంది.

#అలా అయితే జీవితకాలంలో ఎన్నిసార్లుఆవలిస్తాము:
మనిషి స‌గ‌టు జీవిత కాలంలో 400 గంటలు ఆవలించడానికి పోతాయి. అది కూడా పుట్ట‌క ముందు నుండి లెక్కెస్తారంట. అంటే జీవిత‌కాలంలో 16 నుండి 17 రోజులు ఆవ‌లింత‌ల‌కే పోతాయ‌న్న‌మాట‌.

Related posts

మరో రెండు రోజులు వర్షాలు .. అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న సీఎం..

vimala p

ఆ వ్యవహారంలో తప్పించుకోలేవు.. కేటీఆర్‌ కు రేవంత్ వార్నింగ్ 

vimala p

త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకీ, నాని మల్టీస్టారర్ ?

vimala p