telugu navyamedia
సినిమా వార్తలు

‘యాత్ర’ మా వ్యూ.. 

yatra movie on feb 28
బ్యానర్ : 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ 
న‌టీన‌టులు : ముమ్మూటి, జగపతిబాబు, సుహాసిని, రావు రమేష్ తదితరులు 
దర్శకత్వం : మహి వి. రాఘవ 
సంగీతం: కృష్ణ కుమార్ 
ఛాయాగ్ర‌హ‌ణం: సత్యన్ సూర్యన్ 
నిర్మాత: విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి 
దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తీసిన యాత్ర మూవీ శుక్రవారం వరల్డ్ వైడ్ గా 970 స్క్రీన్ లపై విడుదలైంది. డాక్టర్ వైఎస్ పాత్రలో మళయాళ సూపర్ స్టార్ ముమ్ముట్టి జీవించాడు. స్క్రీన్ మీద చూస్తుంటే వైఎస్ మళ్ళీ వచ్చాడా అన్నట్లుగా మెప్పించాడు. ఇక ఈ సినిమాలో డాక్టర్ వైఎస్ పాత్రతో పాటు ఆయా పాత్రలను తీర్చిదిద్దిన ఘనత మహీ వి రాఘవ్ కే దక్కుతుంది. ఇక రాజారెడ్డి కేరక్టర్ లో జగపతి బాబు నటన సూపర్బ్. ఒకానొక దశలో ముమ్ముట్టి,జగపతి బాబు ఒకరికొకరు పోటీ పడి నటించారు. సబితా పాత్రలో సుహాసిని చక్కగా నటించారు. రావు రమేష్ వంటి నటులు అద్భుతంగా నటించారు. ఇక సినిమాకు మ్యూజిక్ ఎక్కడికక్కడ చక్కగా అమరింది. ఎక్కడ ఎలా సెట్ అవ్వాలో అలా అయింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా కుదిరింది.
కథ కొత్తదేమీ కాకపోయినా, దానిని చక్కటి తెరకెక్కించడంలో దర్శకుడు విజయం సాధించాడు. డాక్టర్ వైఎస్ మరణం తర్వాత బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఈ సాంగ్ అందరిని కట్టిపడేస్తుంది. అందరికీ తెల్సిన కథను రొటీన్ కి భిన్నంగా కొత్తదనం చూపిస్తూ స్క్రీన్ ప్లే నడిపించి తీరు సూపర్బ్. ఇంకా చెప్పాలంటే ఎక్కడా రాజకీయ రంగు అంటకుండా,ఓ మహనీయుడు జీవితం ఎలా ఉండాలో అలా తీర్చిదిద్దారు. కాంగ్రెస్ తరపున నెగ్గిన డాక్టర్ వైఎస్ ఆపార్టీ తరపున సీఎం అయిన తీరు,పైగా కాంగ్రెస్ కి ఎక్కడా డామేజ్ జరగకుండా చిత్రీకరించిన తీరు హేట్సాఫ్ అనిపించుకుంటుంది. 
వైఎస్ ను తలపిస్తాయి. ప్రజల సమస్యలు ఎలా అర్ధం చేసుకున్నారో, ప్రజల మనిషిగా ఎలా ఎదిగారో చాలా చక్కగా చూపించారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో 2003లో డాక్టర్ వైఎస్ చేపట్టిన పాదయాత్ర ఎలా సాగించారు, ఎంతమంది ప్రజలతో మమేకం అయ్యారు, రైతు సమస్యలను ఏ కోణంలో చూసారు, రైతే రాజు అనే దానికి ఎలాంటి అర్ధం ఇచ్చారు. అలాగే వివిధ వర్గ్లాల సమస్యలను అర్ధం చేసుకున్నాక వాటిని ఏవిధంగా తీర్చారు ఇలా అన్ని కోణాల్లో ఈ సినిమాను చక్కగా డైరెక్టర్ మహీ తీర్చిదిద్దారు.
హెలికాఫ్టర్ ప్రమాదంలో డాక్టర్ వైఎస్ మరణించిన తీరుని ఆవిష్కరించిన తీరు కళ్ళు చమరుస్తాయి. వాతావరణం బాగోలేకపోయినా, ప్రమాదం అని తెల్సినా కూడా తనకోసం వెయిట్ చేసే ప్రజలను కలుసుకోవాలని బయలుదేరడం, హెలికాఫ్టర్ కూలిపోవడం వంటి ఘటనలను నేచురల్ గా తీశారు. డాక్టర్ వైఎస్ మరణంతో ఎంతమంది అభిమానులు,,కార్యకర్తలు ప్రాణాలు వదిలారో ఇవన్నీ నేచురల్ గా చూపించారు. డాక్టర్ వైఎస్ అభిమానులకు, అనుచరులకు నిజంగా ఈ మూవీ ఓ చక్కటి జ్ఞాపకం అని చెప్పాలి. 
రేటింగ్ : 3.5/5

Related posts