telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రేపే ‘యాత్ర’ చిత్రం విడుదల..

yatra movie on feb 8th

మరో బయోపిక్ విడుదలకు సిద్ధం అయ్యింది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆధారంగా రూపొందిన ‘యాత్ర’ సినిమా ఈ శుక్రవారం(ఫిబ్రవరి 8) ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేస్తున్నారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ‘యాత్ర’ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంటే.. ఎన్టీఆర్ ఫస్ట్ పార్ట్ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ మాత్రం అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రాబోతోంది. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ‘వారాహి చలనచిత్రం’ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

నిజానికి ఎన్టీఆర్ రెండో భాగం కూడా ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. అనివార్య కారణాల వల్ల ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ విడుదల తేదీని వాయిదా వేశారు. అయితే ఫిబ్రవరి 22న ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. ఈ వారంలోపు విడుదల తేదీపై క్లారిటీ రానుంది.

Related posts