telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సెన్సార్ పూర్తిచేసుకున్న.. యాత్ర… ఒక్కకట్టూ లేదు..

yatra movie on feb 28

‘యాత్ర’ చిత్రం ద్వారా దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పాదయాత్రను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తాజాగా సెన్సార్ పూర్తీ చేసుకుంది. అయితే, ఎటువంటి కట్స్ లేకుండా క్లీన్ యూ సర్టిఫికెట్ ను సెన్సార్ బోర్డ్ ఇచ్చింది. ఈ సినిమాకు సెన్సార్ అంత సులువుకాదని, ఇబ్బందులు తప్పవని భావించిన వారికి షాకిస్తూ, ‘యూ’ సర్టిఫికెట్ ఇచ్చిన బోర్డు సభ్యులు, సినిమా బాగుందని వ్యాఖ్యానించడం విశేషం.

ఈ విషయాన్ని మీడియాతో పంచుకున్న చిత్ర యూనిట్, సెన్సార్ బోర్డు మెంబర్స్ అభినందనలు తెలిపారని పేర్కొంది. కాగా, వైఎస్ పాత్రను మమ్ముట్టి పోషించిన ఈ చిత్రంలో పలువురు ప్రముఖులు ఇతర పాత్రలను చేశారు. ఈ సినిమాను భలే మంచిరోజు, ఆనందో బ్రహ్మ వంటి చిత్రాలను నిర్మించిన 70 ఎంఎం ఎంటర్ టెయిన్ మెంట్స్ నిర్మించగా, వచ్చే నెల 8న ఇది విడుదల కానుంది. చాలా కాలం తరువాత మమ్ముట్టి నటించిన డైరెక్ట్ తెలుగు చిత్రం ఇదే కావడంతో సినిమాపై అంచనాలూ భారీగానే ఉన్నాయి.

Related posts