telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

స్టార్ హీరో కోసం అభిమాని సజీవ దహనం

Yash's fan tries to suicide

సాధారణంగా తమ అభిమాన హీరోల కోసం చాలా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అయితే ఆ అభిమానం ముదిరితే ఎలాంటి అనర్థాలు జరుగుతాయో తెలుసుకోవడానికి ఈ సంఘటన ఓ నిదర్శనం. ఈ ఘటన యశవంతపురలో చోటు చేసుకుంది. బెంగుళూరు రూరల్ నెలమంగళ తాలుకూశాంతినగర్ కి చెందిన రవి అనే వ్యక్తి యష్ కి వీరాభిమాని.

ఈరోజు కన్నడ స్టార్ యష్ పుట్టినరోజు సందర్భంగా… ఆయనకు వీరాభిమాని అయిన ఓ రవి ఆయనను కలవడానికి యష్ నివాసం దగ్గరికి వచ్చాడు. అయితే ఎంతసేపు వేచి ఉన్నా కూడా ఆ అభిమానిని కలవడానికి యష్ సెక్యూరిటీ అనుమతి ఇవ్వలేదు. దీంతో మధ్యాహ్నం వరకు వేచి ఉన్న రవి ఆ తరువాత సహనం కోల్పోయి పెట్రోలు పోసుకొని సజీవ దహనానికి ప్రయత్నించాడు. వెంటనే స్థానికులు అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడి శరీరం 75 శాతం కాలిపోయింది, ఇప్పుడు రవి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముందుగానే ఆత్మహత్య చేసుకోవాలన్న ఉద్దేశ్యంతో రవి పెట్రోలు వెంట తెచ్చుకున్నట్లుగా అభిమానిస్తున్నారు.

Related posts