telugu navyamedia
telugu cinema news trending

మరోసారి తండ్రి అయిన యష్

Yash

కేజీఎఫ్ చిత్రంతో దేశ వ్యాప్తంగా ఆద‌ర‌ణ పొందిన క‌న్న‌డ స్టార్ హీరో యశ్ గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో తండ్రి ప్ర‌మోష‌న్ అందుకున్న సంగ‌తి తెలిసిందే. రాధిక,యశ్‌లు 2016లో బ్ర‌హ్మీస్‌-గౌడ సంప్ర‌దాయం ప్ర‌కారం వివాహం చేసుకోగా, డిసెంబ‌ర్ 2,2018న వారికి పండంటి బిడ్డ జ‌న్మించింది. రాధిక‌, య‌శ్‌లు టీవీ సీరియ‌ల్స్‌తో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేయ‌గా, 2008లో మొగ్గిన మ‌సు అనే చిత్రంతో తొలిసారి వెండితెర‌కి ప‌రిచ‌యం అయ్యారు. డ్రామా, మిస్ట‌ర్ అండ్ మిసెస్ రామాచారి సంతు స్ట్రైట్ ఫార్వార్డ్ అనే చిత్రాల‌లో వారిరివురు క‌లిసి న‌టించారు. య‌ష్ ప్ర‌స్తుతం కేజీఎఫ్‌2 చిత్రంతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల‌ ఆయ‌న త‌న కూతురి ఫోటోని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ పాప‌కి అంద‌రి బ్లెస్సింగ్స్ కావాలని కోరాడు. య‌శ్ భార్య రాధిక పండిట్ కూడా త‌న కూతురిని ప్రపంచానికి ప‌రిచ‌యం చేసింది. ఈ ఏడాది జూన్‌లో య‌ష్ కూతురు యషికకు 6 నెలలు పూర్తయిన సందర్భంగా ఓ వీడియో రిలీజ్ చేసింది. ముద్దులొలికే చిన్నారి యషిక వీడియో అభిమానుల హృదయాలు దోచుకుంది. కాగా… రాధిక పండిట్ తాజాగా మ‌రో బేబికి జ‌న్మ‌నిచ్చింది. బెంగ‌ళూర్‌లోని ప్రైవేట్ ఆసుప‌త్రిలో రాధికకి పండంటి బాబు జ‌న్మించాడు. త‌ల్లి, బిడ్డ ఇద్ద‌రు క్షేమంగా ఉన్న‌ట్టు తెలుస్తుంది. త్వ‌ర‌లోనే ఆ బుడ‌త‌డిని కూడా ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేయ‌నున్నాడు య‌శ్.

Related posts

స్నానం చేస్తున్న మహిళ… 8 అడుగుల మొసలి దాడి

vimala p

విన‌రా సోద‌రా వీర‌కుమార ట్రైల‌ర్ లాంచ్‌

ashok

పోలీసులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన మహేష్ బాబు

vimala p