telugu navyamedia
సినిమా వార్తలు

25 గ్రామాలకు అండగా “కేజిఎఫ్” హీరో

KGF Hero Yash Shocking Comments

“కె.జి.య‌ఫ్‌” సినిమాతో స్టార్ హీరోగా క్రేజ్ ను సంపాదించుకున్న కన్నడ హీరో యష్ సినిమాల్లోకి వ‌చ్చిన కొద్ది కాలంలోనే త‌న వంతుగా సామాజిక కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు య‌ష్‌. హీరోయిన్ రాధికా పండిట్‌ను పెళ్లి చేసుకున్న ఈ హీరో ఆమె స‌హ‌కారంతో సేవా కార్య‌క్ర‌మాల‌ను మ‌రింతగా చేస్తున్నారు. “యషో మార్గ ఫౌండేష‌న్‌”ను స్థాపించిన య‌ష్‌… దీని ద్వారా నార్త్ క‌ర్ణాట‌క‌లో నీటి ఎద్ద‌డిని ఎదుర్కొంటున్న ప‌లు గ్రామాల‌కు నీటిని స‌ర‌ఫ‌రా చేస్తున్నారు. అలాగే చెరువుల పూడికను తీయిస్తున్నారు. త‌న ఫౌండేష‌న్ ద్వారా య‌ష్ ఈ ఏడాది వేస‌విలో 25 గ్రామాల‌కు చెందిన 100 ఎక‌రాల చెరువుల‌ను బాగు చేయించ‌డంతో పాటు అక్క‌డి ప్ర‌జ‌ల‌కు నీటిని స‌ర‌ఫ‌రా చేయించారు. అలాగే నార్త్ క‌ర్ణాట‌క‌లో ప‌లు గ్రామాల్లోని ప‌శువుల‌కు గ్రాసాన్ని కూడా అందించార‌ట‌. స్టార్ హీరో అయినా కూడా పెద్ద మ‌న‌సుతో ఎంతో డ‌బ్బు ఖ‌ర్చు పెట్టి ఈ హీరో చేస్తున్న మంచి ప‌నుల‌ను చూసి యష్ పై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Related posts