telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

వామ్మో వందరోజులు .. నిప్పులకొలిమిపై ఉన్నట్టే ఉంది .. : యడ్యూరప్ప

yadurappa karnataka

కర్ణాటకలో యడ్యూరప్ప ప్రభుత్వం వంద రోజుల పాలన పూర్తిచేసుకుంది. ఈ వంద రోజుల పాలనా తనకు అగ్ని పరీక్ష వంటిదని కర్నాటక సీఎం ప్రకటించారు. కనీవినీ ఎరుగని వర్షాలు, వరదలతో రాష్ట్రం అతలాకుతలమైందని, 120 ఏళ్లలో ఎప్పుడూ ఇంత భారీగా ప్రకృతి విలయం సంభవించలేదని మంగళవారం ఇక్కడ స్పష్టం చేశారు. వందరోజుల పాలన- సాధించిన విజయాలు అన్న శీర్షికన ఆయనో పుస్తకాన్ని ఇక్కడ విడుదల చేశారు. ఈ సందర్భంగా యడియూరప్ప మాట్లాడుతూ వరదలకు వందలాది గ్రామాలు నీట మునిగాయని అన్నారు. సుమారు నెల రోజులు ఊళ్లకు ఊళ్లే నీట్లోనే ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వందేళ్ల తరువాత అంత ఉపద్రం చవిచూశామని ఆయన చెప్పారు.

కేంద్ర సాయంతో సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టినట్టు యడ్యూరప్ప తెలిపారు. వంద రోజులు, సాధించిన వందలాది లక్ష్యాలు అన్నదాన్నదానిపై ఆయన మాట్లాడుతూ వంద రోజుల్లో వరద బాధితులను కష్టాల నుంచి గట్టెక్కించడం తాము సాధించిన గొప్ప విజయంగా యడియూరప్ప చెప్పారు. ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్దఎత్తున సహాయ కార్యక్రమాలు చేపట్టిన సంఘటనలు లేవని అధికారుల, శాసన సభ్యులు వారివారి పరిధుల్లో బాధితులను ఆదుకున్నారని కర్నాటక సీఎం తెలిపారు. రానున్న రోజుల్లో ఇరిగేషన్, రైతులు, గృహ నిర్మాణం, బెంగళూరు అభివృద్ధిపై దృష్టిసారిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

పారిశ్రామికాభివృద్ధి, పర్యాటక రంగం అభివృద్ధికి పనిచేస్తామన్నారు. ‘బెంగళూరు నగరాన్ని ఓ పర్యాయం చుట్టివచ్చాను. మా మంత్రులు, ఎమ్మెల్యేలు బెంగళూరు అభివృద్ధికి రేయింబవళ్లూ కష్టపడి పనిచేస్తున్నారు. వంద రోజుల్లో నగరం రూపురేఖలు మార్చేస్తాం. మిమ్మల్ని పూర్తిగా సంతృప్తిపరిచేలా మా పనివిధానం ఉంటుంది’అని బీజేపీ సీఎం వెల్లడించారు. కాగా మద్య నిషేధం తమ అజెండానే కాదని ఆయన స్పష్టం చేశారు. 2019 జూలై 26 నుంచి ఆయుష్మాన్ భారత్- ఆరోగ్య కర్నాటక పథకం కింద 1.29 మందికి లబ్ధి చేకూర్చినట్టు యడియూరప్ప తెలిపారు. ఈ పథకానికి 177.23 కోట్ల రూపాయలు ఖర్చుచేసినట్టు ఆయన పేర్కొన్నారు.

Related posts