telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు సామాజిక

టిప్పు జయంతి ఉత్సవాల … రద్దు అనేసిన .. యడ్యూరప్ప ..

yadurappa cancelled tippusultan ustav

ప్రతిఏటా నవంబర్ లో.. కర్ణాటకలో టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ తరువాత ఏర్పాటైన కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) సంకీర్ణ కూటమి సర్కార్.. ఈ ఆనవాయితీని కొనసాగించాయి. ఏటా క్రమం తప్పకుండా టిప్పు సుల్తాన్ జయంతిని నిర్వహిస్తూ వచ్చాయి. గత ఏడాది కూడా నవంబర్ 10వ తేదీన టిప్పు జయంతిని ప్రభుత్వం అధికారికంగా చేపట్టిన విషయం తెలిసిందే. టిప్పు జయంతిని అధికారికంగా నిర్వహించడాన్ని కర్ణాటక బీజేపీ నాయకులు మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నారు. మైసూరును పరిపాలించిన వడయార్ రాజవంశీయులపై దండెత్తిన టిప్పు సుల్తాన్ జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ ఉత్సవాలను వెంటనే రద్దు చేయాలంటూ బీజేపీ నాయకులు డిమాండ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. దీనికోసం వారు ఆందోళనలను కూడా చేపట్టిన రోజులు ఉన్నాయి.

రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి పట్టుమని పదిరోజులు కూడా కాలేదు. శాసనసభలో బలాన్ని నిరూపించుకున్న రెండోరోజే అత్యంత వివాదాస్పదమైన నిర్ణయాన్ని తీసుకున్నారు కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప. మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాలను రద్దు చేయాలని నిర్ణయించారు. తొలి మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ మేరకు కర్ణాటక భాషా, సాంస్కృతిక మంత్రిత్వశాఖకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది నుంచి టిప్పు సుల్తాన్ జయంత్యుత్సవాలను నిర్వహించకూడదని విస్పష్ట ఆదేశాలు ఇచ్చారు. యడియూరప్ప తీసుకున్న ఈ నిర్ణయం సాహసోపేతమైనది భారతీయ జనతాపార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తుండగా.. లక్షలాది మంది మైనారిటీల మనోభావాలను కించపరిచారంటూ కాంగ్రెస్ విమర్శలకు పదును పెడుతోంది.

Related posts