telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సాంకేతిక

లీక్ : .. షియోమీ … ఎంఐ ఎ3 ..

xiaomi mi a3 images and specifications leaked

స్మార్ట్ ఫోన్ అంటే ఇటీవల ప్రతివారికి బాగా ఆసక్తి పెరిగిందనే చెప్పాలి. ఎక్కడ ఏ ఫోన్ విడుదలైనా .. వెంటనే దాని వివరాలు తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అనేక మోడల్ వివరాలు విడుదలకు ముందే లీక్ అవుతున్నాయి. దాన్ని బట్టే వినియోగదారుడికి ఆయా టెక్ పై ఎంత ఆసక్తి ఉందొ అర్ధం అవుతుంది. తాజాగా, షియోమీ త్వరలో తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎంఐ ఎ3ని విడుదల చేయనున్న విషయం విదితమే. ఈ ఫోన్‌కు చెందిన స్పెసిఫికేషన్లు, ఫొటోలు ప్రస్తుతం నెట్‌లో లీకయ్యాయి.

xiaomi mi a3 images and specifications leakedఈ లీక్ ప్రకారం.. ఈ ఫోన్‌లో 6.08 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 48 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, యూఎస్‌బీ టైప్ సి, 4030 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను అందివ్వనున్నట్లు తెలిసింది. ఇక ఈ ఫోన్ ధర వివరాలు వచ్చే నెలలో తెలిసే అవకాశం ఉంది..!

Related posts