telugu navyamedia
సినిమా వార్తలు

బోయపాటి శ్రీను మూర్ఖుడు, పశువుకంటే హీనం… రైటర్ సంచలన వ్యాఖ్యలు

Chinni-KRishna

టాలీవుడ్ లో “ఇంద్ర”లాంటి చిత్రాలకు కథలను అందించిన రైటర్ చిన్నికృష్ణకు గతకొంతకాలంగా అవకాశాలు బాగా తగ్గాయి. ఈ క్రమంలో చిన్నకృష్ణ మెగా ఫ్యామిలీ, జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ లపై సంచలన వ్యాఖ్యలు చేసి సంచలనంగా మారారు. వైసిపికి మద్దతుదారుడు కావడంతో చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు. అంతేకాదు ప్రెస్ మీట్ పెట్టి మరీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు, చిరంజీవిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా బోయపాటిపై ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. నిన్నగాక మొన్న బోయపాటి ఒక సినిమా తీశాడని, విలన్ తలను హీరో నరకగా… వారిని గాల్లోనే గద్దలు ఎగరేసుకెళ్ళడం లాంటి సినిమాలు తీసే మూర్ఖుడని, అజ్ఞాని అని సంచలన కామెంట్స్ చేశారు. అంతేకాదు పశువుకంటే హీనమైన ఆ దర్శకుడితో చంద్రబాబు పుష్కరాల ఏర్పాట్లు చేయించి ఎంతోమంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యారని విమర్శించారు. ఇప్పుడు చిన్ని కృష్ణ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

Related posts