telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ప్రపంచ కప్ కి.. భారత సేన.. వీరే..

world cup India team

ఈ ఏడాది మేలో ఇంగ్లండ్, వేల్స్ వేదికగా జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్ బరిలోకి దిగే టీం ఇండియా ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ సోమవారం ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ఉదయం సుప్రీం కోర్టు నియమిత కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్(సీఓఏ) ప్రత్యేకంగా సమావేశమైంది. ముంబైలోని బీసీసీఐ క్రికెట్ సెంటర్‌లో జరిగిన ఈ సమావేశానికి జట్టు చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ, చీఫ్ కోచ్ రవిశాస్త్రి సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

నేడు 15 మంది ఆటగాళ్లతో ప్రకటించిన జట్టులో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌గా రోహిత్ శర్మ పేరును ప్రకటించారు. వీరితో పాటు ఎంఎస్ ధోనీని ప్రధాన కీపర్‌గా, సెకండరీ కీపర్‌గా దినేశ్ కార్తీక్‌ని జట్టులోకి తీసుకున్నారు. ఇక రిజర్వ్ ఓపెనర్‌గా కేఎల్ రాహుల్‌కి జట్టులో చోటు కల్పించారు. ప్రధాన పేసర్లగా భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీలను, స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, యుజవేంద్ర చాహల్‌లను తీసుకున్నారు.. విజయ్ శంకర్, కేదార్ జాదవ్, హార్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలను ఆల్ రౌండర్లుగా జట్టులోకి తీసుకున్నారు.

టీం ఇండియా జట్టు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, కేఎల్ రాహుల్, విజయ్ శంకర్, ఎంఎస్ ధోనీ, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, యుజవేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, హార్థిక్ పాండ్యా, మహ్మద్ షమీ.

Related posts