telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

రైతు బందు అమలు భేష్.. తెలంగాణ సర్కారుకు ప్రపంచ బ్యాంకు కితాబు.. !

world bank appreciates telangana govt

తెలంగాణాలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బందుకు ప్రశంసలు అంతర్జాతీయంగా వస్తుండటం విశేషం. పంటల సీజన్‌లో రైతులు ఎరువులు, విత్తనాలు ఇతరత్రా అవసరాలకు వడ్డీవ్యాపారుల వద్ద చేతులు చాచకుండా ఉండేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అద్భుత పథకం రైతుబంధు. దీని అమలు తీరును తెలుసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం, పకడ్భందీ చర్యలు సర్వదా ప్రశంసనీయం అని ప్రపంచబ్యాంకు కితాబిచ్చింది. లబ్దిదారులకు పెట్టుబడి సాయం అందిందా లేదా అని తెలుసుకోవడంలో చేపట్టిన చర్యలను తన అధ్యయన పత్రంలో పేర్కొంది.

జార్ఖండ్‌ కూడా ఇదే విధానాన్ని అవలంబించాలని అనుకుంటున్నదని, కేంద్రం కూడా తన పథకాల అమలు తీరును ఇలాగే తెలుసుకోవాలనుకుంటున్నదని తెలిపింది. గతేడాది వానాకాలం నుంచి తెలంగాణ ప్రభుత్వం ఎకరాకు రూ. 4 వేల చొప్పున రెండు సీజన్లకు రూ. 8 వేలు అందిస్తున్నది. కాని ఈ ఏడాది మాత్రం సీజన్‌కు రూ. 5 వేల చొప్పున రెండు పంటలకు రూ.10 వేలు చేయనున్నది. లబ్దిదారులకు సాయం అందేలా చర్చలు తీసుకున్నది. పటిష్ట సాయం అందిందా లేదా అని తెలుసుకునే ఏర్పాట్లు చేసింది.

తక్కువ ఆదాయం ఉన్న దేశాలలో సేవలను సమర్ధంగా వినియోగించుకోవడం పెద్ద సవాల్‌అని అటువంటిది తెలంగాణ ప్రభుత్వం నేరుగా చెక్కులను పంపిణీ చేసి లబ్దిదారుడికి సొమ్ము అందేలా చేసిందని తెలిపింది. చెక్కులు అందాయా లేవా అని నేరుగా లబ్దిదారులకు ఫోన్‌చేసి వివరాలు తెలుసుకునే వ్యవస్థను ఏర్పాటు చేసుకుందని పేర్కొంది. ఈ అధ్యయనానికి దాదాపు రూ. 25.5 లక్షలు ఖర్చు చేసిందని ప్రపంచబ్యాంకు తెలిపింది.

Related posts