telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నడిరోడ్డుపై కారును తోస్తూ హీరో… వీడియో వైరల్

Sudheer-babu

టాలీవుడ్‌ ప్రముఖ హీరో సుధీర్ బాబు నడి రోడ్డుపై కారు తీస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెట్రోల్ అయిపోవడం వల్ల రోడ్డుపై ఆగిపోయిన కారును తోయడం అనేది వర్కవుట్‌లో భాగమట. అవును… సుధీర్ బాబు చేస్తున్న సరికొత్త వ్యాయామం. తను కారును తోస్తున్న వీడియోను సుధీర్ బాబు ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. “మీ కారుతో వర్కవుట్.. వర్కవుట్ ఎప్పుడూ రోటీన్‌గా, బోరింగ్‌గా ఉండడం మా ట్రైనర్ జాఫర్ అలీకి నచ్చలేదు. దాంతో నా వర్కవుట్‌ను సరికొత్తగా, ఆసక్తికరంగా మార్చాడు. రోడ్డుపై నా కారును నా చేత తోయించాడు. మీ శరీరంలో కొంత ఇంధనం వేసుకుని మీ కారును ముందుకు తీసుకెళ్లండి” అని సుధీర్ బాబు ట్వీట్ చేశాడు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కోసం ఈ వర్కవుట్ చేస్తున్నట్టు సుధీర్ బాబు తెలిపాడు.

Related posts