రాజకీయ వార్తలు వార్తలు

శ్రమ సిద్ధాంతం

work formula
శ్రమించడం,
శ్రమించాలనుకోవడం,
శ్రమించే అవకాశం కలగడం,
మనిషి మనుగడలో,
అక్కరకు వచ్చె ….
ఆనంద క్షణాలు !
 
కష్టించి పనిచేసేవాడు,
కష్టం లోనించి పుట్టుకు వచ్చే ..
సుఖాన్ని ….
అనందంగా …
ఆస్వాదించ గలుగుతాడు ….,
శ్రమించకుండా ….
సుఖాన్ని ఆశించే వాడు,
బ్రతుకంతా …
దుఃఖాన్ని పట్టుకుని,
జీవశ్చవం లా ….
బ్రతుకు కొమ్మను పట్టుకుని,
వ్రేలాడు తుంటాడు …!
 
శ్రమించడం ఎలాగో …
తేనెటీగను చూసి నేర్చుకోవాలి ,
చెట్టు ..చెట్టుకు తిరిగి,
కుసుమించిన,
పుష్ప రాజాలను ..
వెతికి పట్టుకుని …
బొట్టు ..బొట్టు ..మకరందాన్ని,
సేకరించి …
తన రాజ విలాసం లో ..
భద్ర పరచటం …,
మామూలు విశయం కాదు !
 
అందుకే …
కష్టానికి ఫలితం సుఖం ,
సుఖం అందిందించేది ..
ఆనందం ….!
ప్రతి కష్ట జీవి  ఆనందం ,
కలసి పయనిస్తుంది …
జీవిత మకరందమై …!!
 
___డా.కె .ఎల్ .వి.ప్రసాద్ ,
     హనంకొండ.౪.
9866252002

Related posts

15 వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు

admin

దేశాభివృద్ధికి రిజర్వేషన్లే అడ్డు…అంబేద్కర్ కూడా 10 ఏళ్లకే అన్నారు…: స్పీకర్

chandra sekkhar

పూజా కార్యక్రమాలలో ‘జెర్సీ’…

chandra sekkhar

Leave a Comment