telugu navyamedia
ట్రెండింగ్ సామాజిక సినిమా వార్తలు

మహిళలు .. పొట్టి దుస్తులు వేసుకునేది .. పడేయడానికే .. అయితే ఏంటి..?: ఓ మహిళ

women wear shot dresses to tempt men

ఓ ఢిల్లీ మహిళ పొట్టి దుస్తులు ధరించే అమ్మాయిలపై చేసిన వ్యాఖ్యలు, ఆపై చుట్టుపక్కల ఉన్న యువతులు ఆమెను నిలదీయడానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అంతా తమను చూడాలన్న కోరికతోనే అమ్మాయిలు షార్ట్స్ వేసుకుని రోడ్లపైకి వస్తున్నారని, అత్యాచారం చేయించుకునేందుకు వీరంతా సిద్ధంగా ఉన్నారని, సాధ్యమైనంత ఎక్కువ నగ్నంగా కనిపించడమే వీరి ఉద్దేశమని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఇక ఆమె మాటలను సీరియస్ గా తీసుకున్న ఓ యువతి, మొత్తం ఘటనను వీడియో తీసి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసుకోగా, ఇప్పటికే నాలుగు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

ఓ రెస్టారెంట్ లో తాను, తన స్నేహితులు ఉండగా, సదరు మహిళ తమ వద్దకు వచ్చి వాదనకు దిగిందని, షార్ట్స్ వేసుకున్నందుకు సిగ్గుపడాలని ఆమె అనడంతో, తాము వాదనకు దిగామని సదరు యువతి తనకు ఎదురైన అనుభవాన్ని వెల్లడించింది. ఇలాంటి దుస్తులు వేసుకున్న వారిని అవకాశం లభించినప్పుడెల్లా రేప్ చేయాలని రెస్టారెంట్ లోని పురుషులకు ఆమె చెప్పగా, వారంతా చప్పట్లు కొట్టారని, దీంతో ఆమె వికృత మనస్తత్వాన్ని తాము ప్రశ్నిస్తూ వీడియో తీశామని వెల్లడించింది. ఆమె క్షమాపణలు చెప్పాల్సిందేనని తాము డిమాండ్ చేసినా పట్టించుకోలేదని తెలిపింది. దాదాపు పది నిమిషాల నిడివివున్న ఈ వీడియోను తీసిన అమ్మాయి ఎవరన్నది మాత్రం తెలియరాలేదు.

Related posts