telugu navyamedia
trending

మద్యం కొంటే .. చంపుతా.. : గృహిణి

NO ALCOHOL IN TELANGANA

మద్యం ఎన్ని ఇళ్లను నాశనం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రభుత్వం మాత్రం ఇంకా అమ్మకాలను పెంచుతుంది తప్ప, నిషేధించే యోచన మాత్రం చేయటం లేదు. దీనితో ఓ ఆడకూతురు తమ కుటుంబం నాశనం అవుతుందని తట్టుకోలేక సాహసం చేసింది. మద్యం తాగితే చంపేస్తా అంటూ బెదిరిస్తోంది..ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఇల్లు గడిపే మార్గాన్ని పట్టించుకోకుండా నిత్యమూ మద్యం తాగుతున్న భర్తను చూసిన ఆమె, వినూత్న రీతిలో నిరసన తెలిపింది. తమిళనాడు, తిరుపూరులో ఈ ఘటన జరిగింది.

ఆ ప్రాంతంలో మద్యం విక్రయాలు సాగిస్తున్న టాస్మాక్‌ దుకాణానికి రెండు కత్తులతో వచ్చిన కవిత (25) అనే యువతి, ఎవరైనా మద్యం కొనుగోలు చేసేందుకు వస్తే కత్తితో పొడుస్తానని, తనను అడ్డుకుంటే ఆత్మహత్య చేసుకుంటానని హల్ చల్ చేసింది. ఈ ప్రాంతంలో చట్టవిరుద్ధంగా అనేక టాస్మాక్‌ దుకాణాలు వెలిసి, సమయపాలన లేకుండా విక్రయాలు సాగిస్తున్నాయని తెలుస్తోంది.

స్థానిక పీఎన్‌ రోడ్డులోని పాండియన్‌ నగర్‌ లో ఉన్న దుకాణం వద్దకు వచ్చిన ఆమె నిరసనకు మందుబాబులు పరుగులు తీశారు. విషయం పోలీసులకు తెలిసి, వారు వచ్చేలోగానే, దుకాణ నిర్వాహకులు పారిపోగా, రెండుపెట్టెల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆపై కవితను స్టేషన్ కు తీసుకెళ్లి, కౌన్సెలింగ్ ఇచ్చి, ఈ తరహా నిరసనలు చట్టవిరుద్ధమని చెప్పి పంపించి వేశారు.

Related posts

గర్భవతులు .. మేకప్ వేసుకోవచ్చా..?

vimala p

ఓట్ల లెక్కింపు .. ఇలా.. పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం, వీవీప్యాట్‌…

vimala p

శబరిమల ను .. సంప్రోక్షణ.. తిరిగి దర్శనం ప్రారంభం…

vimala p