telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ముంబై : … కిసాన్‌ లాంగ్‌ మార్చ్‌లో .. మహిళలు కీలక పాత్ర..

women participation in long march

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కిసాన్‌ లాంగ్‌ మార్చ్‌లో మహిళలు ఎంతో కీలక పాత్ర పోషించారని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రాచీ అతిల్వేకర్‌ తెలిపారు. నాసిక్‌ నుంచి ముంబై వరకూ జరిగిన చారిత్రాత్మక కిసాన్‌ లాంగ్‌ మార్చ్‌లో 25,000 మంది మహిళలు పాల్గన్నారు. వారిలో ఐద్వా, కిసాన్‌ సంఫ్‌ కార్యకర్తలున్నారు. రైతుల సమస్యలతోపాటు మహిళా రైతుల హక్కుల గురించి ఈ మార్చ్‌ నిర్వహించారు. రుణమాఫీ, మద్దతు ధర, అటవీ హక్కుల చట్టం తదితర అంశాలపై ఈ పోరాటం చేశారు. భర్తతో పాటు భార్యకు కూడా భూమిపై హక్కు కల్పిస్తూ ప్రభుత్వ రికార్డుల్లో ఉండటం లేదు. భర్త చనిపోయిన తరువాత ఆ భూమి భర్త అన్నదమ్ములు తదితర వ్యక్తులు పొందుతున్నారు. దీంతో, ఆ కుటుంబాన్ని పోషిస్తోన్న భార్యకు భూమిపై హక్కులేక చాలా ఇబ్బందులు పడుతోంది. రుణం పొందాలన్నా, మద్దతు ధర పొందాలన్న ఆమె సాధ్యం కావటం లేదు. మహిళను రైతుగా గుర్తించాలని, రికార్డుల్లో పేరు నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం.

థానే నుంచి ముంబై వరకు దాదాపు 80 కిలోమీటర్లు లాంగ్‌మార్చ్‌లో నడిచాను. 20 వేల మంది మహిళలు విరామం లేకుండా పాల్గన్నారు. వీరిలో ఎక్కువ మంది నాసిక్‌, పాలిఘర్‌ జిల్లాల నుంచి వచ్చిన ఆదివాసీ మహిళలే. అప్పుడు అటవీ హక్కుల చట్టం చర్చలో ఉంది. ఈ చట్టం పార్లమెంట్‌లో చర్చకు వచ్చినప్పుడు వామపక్ష ఎంపీలే గిరిజనుల పక్షాన ఉన్నారు. ప్రభుత్వంతో పాటు మిగిలిన పార్టీలు గిరిజన హక్కులు గాలికొదిలేశాయి. మొదటి లాంగ్‌ మార్చ్‌లో చాలా సమస్యలు పరిష్కరించుకోవటంతో రెండోసారి లాంగ్‌ మార్చ్‌లో మధ్యతరగతి రైతులు, మహిళా రైతులు, ఇతర జిల్లాల వారు భాగస్వాములయ్యారు. లాంగ్‌మార్చ్‌ ప్రారంభమయ్యేటప్పుడు మీడియా కనీసం పట్టించుకోలేదు. రెండు రోజుల తరువాత సోషల్‌ మీడియాలో విస్త అత ప్రచారం జరగడంతో, మీడియా రైతుల వద్దకు రావల్సి వచ్చింది. ఆ తరువాత బాగా కవరేజ్‌ ఇచ్చింది. లాంగ్‌ మార్చ్‌లో పాల్గన్న మహిళలు ఇప్పటికీ ఐద్వాతోనే ఉన్నారు. చాలా ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పోరాటాలు నిర్వహించారు.

వాణిజ్య కేంద్రమైన ముంబై లో మహిళలు సమస్యలెన్నో ఉన్నాయి. కళాశాలల్లో చదువుకుని బయటకు వస్తున్న విద్యార్థినులకు ఉపాధి దొరకడం లేదు. పెద్దనోట్ల రద్దుతో మహిళలు ఎక్కువమంది ఉపాధి కోల్పోయారు. మూడు తరాలుగా పనిచేస్తున్న వారూ ఉపాధి కోల్పోయారు. గ్రామీణ ప్రాంతాల్లో అర్హులైన మహిళలందరికీ ఉపాధిహామీ పథకం అందడం లేదు. ముంబై లో ఉమెన్‌ ట్రాఫికింగ్‌ పెరిగినా, బాధిత కుటుంబాలు బయటకు రాకపోవడంతో ప్రభుత్వం స్పందించడం లేదు. తొలిసారి ఐద్వా జాతీయ మహాసభ నిర్వహిస్తున్న అనుభవంతోనూ, స్ఫూర్తితోనూ మహిళా ఉద్యమాన్ని నిర్మిస్తాం. ఈ మహాసభ ఉద్యమ బలోపేతానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం అన్నారు.

Related posts