telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కోడిపందేల బరులలో.. మహిళలదే పైచేయి… వారికోసం ప్రత్యేక ఏర్పాట్లు..

women participation in bettings on festival

మహిళలు ఎందులోనూ తీసిపోరని నిరూపించుకోడానికి, ఆ సందర్భం-ఈ సందర్భం అంటూ లేకుండా దొరికిన ప్రతి దానిని వాడుకుంటున్నారు. దానికి స్పష్టమైన ఉదాహరణ, తాజాగా పండుగ సందర్భంగా గోదావరి జిల్లాల్లో జరిగిన కోడిపందేలు. ఈ పందేలు మూడురోజులపాటు రేయింబవళ్లు జరుగగా, అందులో కూడా ఉత్సాహంగా మహిళలు పాల్గొనడం, వారికోసం నిర్వాహకులు భేషుగ్గా ఏర్పాట్లు చేయడం విశేషం. ఈ సారి 30 పెద్ద బరులు, 200 చిన్న బరులు ఏర్పాటు చేయగా అందులో మహిళలు విరివిగా పాల్గొనడం విశేషం. భోగి నాడు మొదలైన కోతాట, గుండాట, లోపలా బయట, పేకాట, కోడిపందాలు మూడు రోజులపాటు రేయింబవళ్లూ సాగాయి. ఈ జూదాల్లో డబ్బు సంపాదించే వారికన్నా, నిర్వాహకులకు సమర్పించుకుని వచ్చేవారే అత్యధికులని తెలిసి కూడా తమ వద్ద ఉన్న సమస్తమూ అక్కడే కోల్పోయారు.

పందాల విషయంలో ఈ సంవత్సరం అమ్మాయిలు కూడా ఏ మాత్రం తగ్గలేదు. ఉత్సాహంగా బరుల వద్దకు వస్తున్న మహిళలకు, యువతకు నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి మరీ స్వాగతం పలకడం గమనార్హం. వారికి ప్రత్యేకంగా కుర్చీలను కేటాయించి, వారికి కావాల్సిన కూల్ డ్రింక్స్, మంచినీరు, తినుబండారాలు తదితరాలను ఎప్పటికప్పుడు పంపుతూ, వారిని మరింతగా పందాల వైపు ప్రోత్సహించారు.

కొన్ని బరుల వద్ద కేవలం మహిళల కోసమే పందాలు కూడా జరిగాయి. దీంతో, కోడిపందెమైనా, గుండాటైనా తాము కూడా సై అంటూ, ఎంతో మంది యువతులు పందాలు కట్టారు. పోలీసుల ఆంక్షలు ఏ మాత్రం కనిపించక పోవడంతో ఈ పందాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఎక్సైజ్ శాఖకు, పోలీసులకు భారీగా ముడుపులు ఇచ్చిన బరుల నిర్వాహకులు తమవైపు పోలీసులు కన్నెత్తి కూడా చూడకుండా చూసుకున్నారు.

Related posts