telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

ఇలా కూడా అత్తారింటికి వస్తారా.. ఆస్తికోసం ఎన్ని చేసిందో ఈ కోడలు..

women killed family for money

పెళ్ళికి ముందు ఇటు ఏడుతరాలు అటు ఏడుతరాలు పరికించమని పెద్దలు ఎందుకు చెప్పారో అర్ధం అవుతుంది కొన్ని సందర్భాలు పరిశీలిస్తే.. ఎలాగైనా అత్తవారి ఆస్తికి యజమానురాలు కావాలనుకుంది. దీనికి అడ్డంగా ఉన్న ఆరుగురిని చంపాలని పక్కా ప్లాన్ వేసింది. అలా అని అందరినీ ఒకేసారి చంపేస్తే.. తెలిసిపోతుందనుకొని పక్కా ప్లాన్ వేసి ఒక్కొక్కరిని టార్గెట్ చేసింది. ఇలా 14 ఏళ్లలో ఆరుమందిని చంపేసింది. అయితే నిజం ఎప్పటికైనా బయటపడుతుంది కదా. అది తాజాగా బట్టబయలైంది. ఈ ఆరు కేసులను దర్యాప్తు చేసిన పోలీసులు.. ఎట్టకేలకు కిలాడీ కోడలు భాగోతాన్ని బహిర్గతం చేశారు. కేరళలోని కోళికోడ్ కూడథాయ్‌లో ఉంటోన్న రాయ్ థామస్‌కు జూలి థామస్‌తో 14ఏళ్ల క్రితం వివాహమైంది. అయితే రాయ్‌ థామస్‌ పెద్దనాన్న కుమారుడైన షాజుతో పాటు రాయ్ ఆస్తిపై జూలి కన్న పడింది. దీంతో అతడితో పాటు పన్నాగమేసి 2002 నుంచి ఇంట్లో ఒక్కొక్కరిని చంపడం మొదలుపెట్టడం ప్రారంభించింది. 2002లో అత్త అన్మమ్మ, 2008లో మామ టామ్ థామస్, 2011లో భర్త రాయ్ థామస్, 2014లో అన్నమ్మ సోదరుడు మ్యాథ్యూ.. 2016లొ షాజు భార్య సిలీ, అతడి కుమార్తె అల్ఫోన్సా చనిపోయారు.

వారందరివి సహజ మరణాలే అని అందరినీ నమ్మించిన జాలీ జోసెఫ్ .. ఎవరికీ ఎలాంటి అనుమానాలు రాకుండా అందరి మృతదేహాలను గుట్టు చప్పుడు కాకుండా స్మశానికి తీసుకెళ్లి పాతిపెట్టింది. ఆ తరువాత షాజును వివాహం చేసుకుంది. దీనిపై థామస్ సమీప బంధువు చార్లెస్ కి అనుమానం వచ్చింది. 14 ఏళ్ల వ్యవధిలో కుటుంబసభ్యులు ఒక్కొక్కరిగా చనిపోవడంపై ఆయనకు సందేహం కలిగింది. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. దీంతో విచారణ మొదలుపెట్టిన పోలీసులు మృతదేహాలను తిరిగి బయటికి తీయించారు. వాటిని పోస్టుమార్టంకు తరలించారు. పోస్టుమార్టం నివేదికలో వారిది సహజ మరణం కాదని.. మర్డర్ అని తేలింది. అందరూ సైనెడ్‌ తీసుకోవడం వలన చనిపోయారని వైద్యులు నిర్ధారించారు. వెంటనే జాలీ జోసెఫ్, ఆమె రెండో భర్త షాజును అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్ లో విచారించగా.. అసలు నిజాలు బయటపడ్డాయి. ఆస్తి కోసం తామే మటన్ సూస్ లో సైనెడ్ ఇచ్చి ఒక్కొక్కరిని చంపేశామని ఒప్పుకున్నారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి.. కేసు నమోదు చేసుకున్నారు.

Related posts