telugu navyamedia
political trending

దేశంలోనే తొలిసారిగా.. భారతీయురాలిగా సర్టిఫికెట్.. ఇదే యువతలో రావాల్సింది..!

women got certificate as indian

కులం, మతం అంటూ పిచ్చిలో కొట్టుకుంటున్న వారు నేటికీ లేకపోలేదు. అందులో అత్యంత విద్యావంతులు కూడా ఉన్నారన్నది పచ్చి నిజం. విద్యలేనివాడు వింతపశువు అంటారు కానీ, కొన్నిటిలో విద్యావంతుల కంటే వారే చాలా మేలు. కుల-మతాలను అర్జ్యంగా చేసుకొని రాజకీయనాయకులు దేశంతో ఆడుకుంటున్నారని ఉడుకురక్తం ఉరకలేస్తున్న యువతకు కూడా నేడు తెలియడంలేదు. కానీ ఎక్కడో కొందరు ఉంటారు.. ఇలా.. కులం, మతం కంటే మానవత్వం గొప్పదని చెబుతారు. దీన్ని ఆచరణలో పెట్టిన ఓ యువతి తాను ఏ కులం, మతానికి చెందిన వ్యక్తిని కాదని సర్టిఫికెట్ పొందింది. ఈ ఘటన తమిళనాడులోని తిరుప్పతూర్ లో చోటుచేసుకుంది. స్వామి వివేకానంద, ఏ కాల్ టు యూత్ లో చెప్పినట్టుగా, ఇనుప నరాలు ఉక్కు ఖండరాలు .. అంటే దేశాన్ని రోబోలకు అప్పగించామని కాదు; యువత దేశబాధ్యతలను స్వయంగా తమ భుజాలపై మోయాల్సిన రోజు ఒకటి వస్తుందని.. అప్పుడు వారి ఐక్యతను దెబ్బతీసేందుకు వివిధ శక్తులు కులం, మతం, ప్రాంతం, లింగ తదితర ఆయుధాలతో ప్రయత్నిస్తారని, అప్పుడు యువత ఐక్యత ఇనుప నరాలు, ఉక్కు కండరాలలా బలంగా ఉండాలని అర్ధం. అటువంటి మహానుభావులు ఎప్పుడు మాట్లాడినా, భవిష్యత్తు గురించే హింట్ ఇస్తారు. అదే ఇచ్చారు; మరి అది ఎంతమందికి అర్ధం అయిందో తెలియదుగాని, ఈమెకు అర్ధం అయినట్టుగా ఉంది.

తిరుప్పతూర్ మండలంలోని ఎం.ఎ.స్నేహను తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కులమతాలకు అతీతంగా పెంచారు. దీనితో ఆమె పాఠశాల నుంచి డిగ్రీ సర్టిఫికెట్ల వరకూ అన్నింటిలో కులం, మతం కాలమ్స్ ను ఖాళీగా వదిలేశారు. ఈ క్రమంలోనే తనకు కులం, మతం లేదనీ, భారతీయురాలిగా సర్టిఫికెట్ జారీచేయాల్సిందిగా కోరారు. అయితే రకరకాల సాకులు చెబుతూ ఇందుకు అధికారులు నిరాకరిస్తూ వచ్చారు. చివరికి ఈ విషయం తెలుసుకున్న తిరుప్పతూర్ డిప్యూటీ కలెక్టర్ ప్రియాంక పంకజమ్ వెరిఫికేషన్ చేయించారు.ఇందులో యువతి చెప్పిన వివరాలన్నీ నిజమనీ తేలడంతో ఆమెకు కులం, మతం లేదని సర్టిఫికెట్ జారీచేయాలని ఆదేశించారు.

women got certificate as indianదీనితో స్నేహకు అధికారులు ‘ఎలాంటి కులం-మతం లేదని సర్టిఫికెట్ జారీ చేశారు. దీనిపై స్నేహ హర్షం వ్యక్తం చేశారు. స్నేహ భర్త పార్తిబ రాజా మాట్లాడుతూ.. తమ ముగ్గురు కుమార్తెల స్కూల్ దరఖాస్తుల్లో కూడా కులం, మతం ప్రస్తావన తీసుకురాలేదని స్పష్టం చేశారు. కాగా, ఈ తరహా సర్టిఫికెట్ ను దేశంలో అందుకున్న తొలి వ్యక్తి స్నేహానేనని అధికారులు చెబుతున్నారు.

మొదటి భారతీయురాలు అన్నది నిజమే కదా. సర్టిఫికెట్ ఆ విషయాన్నీ ధ్రువీకరించనవసరం లేదు కానీ, ప్రస్తుతం వెల్లడించాల్సి అవసరం ఉంది. దానికి ఆమె ఒక మార్గం ఎంచుకున్నారు. భారతీయులందరు.. అభినందిద్దాం.

Related posts

అదృశ్యం ట్రైల‌ర్ లాంచ్‌…

vimala p

విజయ్‌ దేవరకొండ మూవీ టైటిల్ రిలీజ్

Vasishta Reddy

నేడు రైతుల ఖాతాలలో .. రెండువేలు..

vimala p