telugu navyamedia
ట్రెండింగ్

నాడు 925 రూపాయలు.. నేడు అదే 7 కోట్లు..

women diamond ring costs 7 crores

ఆస్తులు కూడబెట్టడం ఎవరికైనా అవసరం.. అయితే అందులోను కూడబెట్టినవి మంచి రేటు పలికితే ఇంకా ఆ ఆనందానికి హద్దులే ఉండవు. కొంతమంది చేతిలో ఉన్నవాటితో ఏమి చేయాలో తెలియక.. ఏదో ఒకటి అని కొనేసి పక్కన పడేస్తారు. అది కాస్త గిరాకీ ఉన్న వస్తువు అని తెలియగానే ఆశ్చర్యపడతారు. సరిగ్గా అటువంటిదే ఒక మహిళకు జరిగింది. తాను ఎప్పుడో ముచ్చటపడి కొన్న గాజు ఉంగరం.. అప్పుడు దానికోసం వెచ్చించింది 925 రూపాయలే. కానీ దాని విలువ ప్రస్తుతం 6.8కోట్లు పలుకుతుంది..ఎందుకంటే ఆమె కొన్నది అరుదైన వజ్రం. ఆ విషయం ఇన్నాళ్లు ఆమెకు తెలియకపోవటం విశేషం. కానీ ఇప్పుడు తన వద్ద ఉన్న వస్తువు అంత ఖరీదైనది అని తెలిగాయగానే ఆమె అమితమైన సంభ్రమాశ్చర్యాలకు గురవుతుంది.

ఈ ఘటన వివరాలలోకి వెళితే, బ్రిటన్‌కు చెందిన 55 ఏళ్ల డెబ్రా గొడార్డ్‌ తన వేలికి కోట్ల రూపాయల విలువైన ఉంగరం ముప్పై ఏళ్లుగా ఉన్నా ఆ విషయాన్ని తెలుసుకోలేకపోయింది. సాధారణ గాజుతో చేసిన ఉంగరంగానే దానిని భావించింది. అయితే, ఇటీవల ఆమె తల్లి ఓ మోసగాడి బారినపడి డబ్బు కోల్పోయింది. దీనితో కొంతైనా అవసరం తీరుతుందన్న ఉద్దేశంతో డెబ్రా తన వేలికి ఉన్న ఉంగరాన్ని అమ్మేయాలని నిర్ణయించుకుంది.

దానిని ఓ నగల వ్యాపారి వద్దకు తీసుకెళ్తింది. ఉంగరాన్ని పరీక్షించిన నగల వ్యాపారి 26.27 కేరెట్ల డైమండ్ అని దీనికి రూ.6.8 కోట్ల (7,40,000 పౌండ్లు) కంటే ఎక్కువ రావని చెప్పడంతో ఆశ్చర్యపోయింది. ‘‘కొంతైనా డబ్బు వస్తుందన్న ఉద్దేశంతో నగల వ్యాపారికి దానిని ఇచ్చా. అతడు దానిని పరీక్షించి ‘‘నీకు తెలుసా? ఇదేంటో. ఇదో వజ్రం. దీని విలువ రూ. 6.8 కోట్లు’’ అని చెప్పేసరికి నోట మాటరాలేదు. రాత్రంతా దానినే చూస్తూ కూర్చున్నా. ఏం చేయాలో అర్థం కాలేదు’’ అని గొడార్డ్ చెప్పుకొచ్చింది.

నగల వ్యాపారి దానిని వజ్రమని నిర్ధారించిన వెంటనే ఆమె ఉంగరాన్ని ఆక్షన్ హౌస్‌కు తీసుకెళ్లి వేలం వేయాలని భావించింది. అక్కడ కూడా దానిని వజ్రంగానే నిర్ధారించారు. ఇక అక్కడ దాని విలువ ఎంత పలకనుందో.. మొత్తానికి తన ఉంగరం తో ఆమె కష్టాలన్నీ తీరిపోతున్నాయి. అందుకే అంటారు పెద్దలు, ఉన్నప్పుడే కాస్త వెనకేసుకుంటే.. ఇలాంటి పరిస్థితులలో పనికొస్తుందని.

Related posts