telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

హుస్సేన్ సాగర్‌లో దూకి మహిళ ఆత్మహత్యయత్నం!

New couples attack SR Nagar

హైదరాబాద్ హుస్సేన్ సాగర్‌లో దూకి మహిళ ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఏఎస్ రావు నగర్ కు చెందిన ఓ మహిళ ఇవాళ ఉదయం హుస్సేన్ సాగర్‌లో దూకింది. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న లేక్ పోలీసులు ఆమెను కాపాడారు. లేక్ పోలీసు కామేశ్వర్‌రావు.. చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించారు. అనంతరం మహిళ భర్తకు పోలీసులు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భర్తతో వివాదం కారణంగానే తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది.

Related posts