telugu navyamedia
crime culture news trending

ఒక ఐడియా… మీ వైట్ డ్రెస్ నే మార్చేస్తుంది…!!?

wine

వైట్ డ్రెస్‌పై చిన్న మరక పడ్డ మొత్తం లుక్‌ మారిపోతుంది. డ్రెస్ పాడవ్వడమే కాకుండా మూడ్ కూడా కరాబవుతుంది. ఇలాంటి అనుభవమే యూకేకు చెందిన ఎలియనోర్ వాల్టన్ అనే యువతికి ఎదురైంది. వాల్టన్ చక్కని వైట్ ఔట్‌ఫిట్ వేసుకొని ఓ పార్టీకి వెళ్లింది. పార్టీలో ఫ్రెండ్స్ అందరితో కలిసి వైన్ తాగుతూ ఎంజాయ్ చేస్తుంది. ఇంతలో వాల్టన్ వైట్ డ్రెస్‌పై రెడ్ వైన్ పడింది. దాంతో ఆమె డ్రెస్ కాస్తా పాడైపోయింది. ఆ సమయంలో ఆమెకు ఏం చేయాలో తోచలేదు. వాల్టన్ ఖరీదైన వైట్ డ్రెస్‌పై మరకపడడంతో మిత్రులందరూ అప్‌సెట్ అయ్యారు. అదే సమయంలో వారిలోని ఓ మిత్రురాలికి మంచి ఐడియా వచ్చింది. వెంటనే వాల్టన్‌ను బాత్రూంలోకి తీసుకెళ్లి డ్రెస్ మొత్తం తీయించింది. ఆ తరువాత మరక కనిపించకుండా ఉండేందుకు టాప్ మొత్తాన్ని రెడ్ వైన్‌ పోసి ఎర్రగా మార్చేసింది. అలాగే పాయింట్‌పై కూడా రెడ్ వైన్‌తోనే డిజైన్ చేసి వాల్టన్‌ను వేసుకోమని చెప్పింది. అంతే… అప్పటి వరకు వైట్ డ్రెస్‌పై మరకతో చికాకుగా కనిపించిన వాల్టన్ కాస్తా రెడ్ వైన్‌తో వేసిన డిజైన్‌ డ్రెస్‌తో ఆనందంగా మళ్లీ పార్టీలో జాయిన్ అయింది. నాలుగు గ్లాసుల రెడ్ వైన్ వాల్టన్ కొత్త డ్రెస్ డిజైన్‌కు ఉపయోగించామని ఆమె స్నేహితురాలు మియా విలియమ్సన్ చమత్కరించింది. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోను విలియమ్సన్ ట్వీట్ చేయడంతో అది కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది.

Related posts

లవ్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ గా ‘యురేక’..ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల..!!

vimala p

మోడీ కేబినెట్ లోకి ..మరోసారి ఆ ఏపీ నేత..

vimala p

బాలుడికి గత జన్మ స్మృతులు.. తానే డయానా ను.. అంటున్న వైనం..

vimala p