• Home
  • వార్తలు
  • ఎయిర్‌పోర్టులో పేలిన పవర్‌బ్యాంకు…ఉలిక్కిపడ్డ ప్రయాణీకులు
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

ఎయిర్‌పోర్టులో పేలిన పవర్‌బ్యాంకు…ఉలిక్కిపడ్డ ప్రయాణీకులు

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ మహిళ హల్ చల్ చేసింది. ఎయిర్ పోర్టులోని టెర్మినల్ 1 వద్ద మాళవికా తివారి అనే మహిళకు చెందిన పవర్‌బ్యాంకు పేలుడు కలకలం రేపింది. చిన్నపాటి శబ్దంతో పేలడంతో ఎయిర్ పోర్టులోని ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. అనంతరం విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఎయిర్ పోర్ట్ అధికారుల సమాచారం ప్రకారం మాళవికా ధర్మశాలకు వెళ్లే విమానం కోసం వేచి చూస్తుంది.

ఎయిర్ పోర్టు సిబ్బంది ఆమెను చెకింగ్ కోసం పిలిచారు. తన హ్యాండ్ బ్యాగులో సెల్ ఫోన్ ఛార్జింగ్ కోసం వాడే పవర్ బ్యాంకును పెట్టుకుని సెక్యూరిటీ చెకింగ్ వద్దకు వచ్చింది. అక్కడ హ్యాండ్ బ్యాగులోని వస్తువులను చూపించానికి నిరాకరించడంతో కొద్ది సేపు వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో నియంత్రణ కోల్పోయిన మహిళ బ్యాగులోని పవర్ బ్యాంక్ తీసి నేలకేసి కొట్టింది. దీంతో చిన్నపాటి పేలుడు పసంభవించడంతో కొద్దిసేపు భయానక వాతావరణం ఏర్పడింది. ఆమెను అదుపులోకి తీసుకుని ఎయిర్ పోర్టు పోలీసులు కేసు నమోదు చేశారు.

Related posts

రైతు నానీలు…

chandra sekkhar

అమ్మ పటం…

chandra sekkhar

రికార్డ్: తొమ్మిదేళ్ల తరువాత మొదటిసారి అమెరికాకు తగ్గిన భారతీయులు..!

nagaraj chanti

Leave a Comment