telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

స్నానం చేస్తున్న మహిళ… 8 అడుగుల మొసలి దాడి

Alligator

మహిళ స్నానం చేస్తున్న సమయంలో పెద్ద మొసలి దాడి చేసిన భయానక సంఘటన ఫ్లోరిడాలోని బ్రేవార్డ్ కౌంటీలో గల ఫే లేక్ వైల్డర్‌నెస్ పార్కులో చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న చెరువులో బాధితురాలు స్నానం చేస్తుండగా ఎనిమిది అడుగుల మొసలి ఒక్కసారిగా ఆమెపై దాడి చేసింది. ఇది గమనించిన కొందరు ఆమెను వెంటనే బయటకు లాగేయడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళను చికిత్స కోసం హూటహూటిన సమీపంలోని ప్రాంతీయ వైద్య కేంద్రానికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న ఫ్లోరిడా వన్యప్రాణి అధికారులు బాధితురాలిని మెల్‌బోర్న్‌కు చెందిన నిఖొల్ ఏ.తిల్మన్‌గా గుర్తించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, ఇది మొసళ్ల సంభోగ సీజన్ కావడంతో మగ మొసళ్లు ఇలా దూకుడుగా వ్యవహరిస్తుంటాయని వన్యప్రాణి సంరక్షులు పేర్కొన్నారు. మహిళపై దాడి కూడా ఇదే కొవలో జరిగిందేనని చెప్పారు.

Related posts